మోహుల్‌ చోక్సీ బాధితుల జాబితాలో చేరిన మరో కంపెనీ!

CBI Filed Fresh FIR Against Mehul Choksi - Sakshi

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకుకు రూ 13,000 కోట్ల రుణాలు ఎగవేసిన కేసులో విదేశాల్లో ఉన్న ఆర్థిక నేరగాడు మోహుల్‌ చోక్సీపై మరో కేసు నమోదు చేసింది సీబీఐ. ఇండస్ట్రియల్‌ ఫైనాన్షియల్‌ కార్పోరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఐఎఫ్‌సీఐ) ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది.

మెహుల్‌ చోక్సీ, ఐఎఫ్‌సీఐల మధ్య 2014 నుంచి 2016 వరకు జరిగిన లావాదేవీల్లో చోటు చేసుకున్న మోసాలపై తాజా కేసు నమోదు అయ్యింది,  మోహుల్‌ చోక్సీకి సంబంధించి గీతాంజలి జెమ్‌కి లాంగ్‌టర్మ్‌ క్యాపిటర్‌ రుణం కావాలంటూ 2016లో మోహుల్‌ చోక్సీ దరఖాస్తు చేసుకున్నాడు. ఆ తర్వాత దశల వారీగా ఐఎఫ్‌సీఐ నుంచి రూ. 25 కోట్ల రుణం పొందాడు. 

ఐఎఫ్‌ఐసీ నుంచి తీసుకున్న రుణాలు సకాలంలో మోహుల్‌ చోక్సీ చెల్లించలేదు. ఆ తర్వాత జరిగిన లావాదేవీల్లో మోహుల్‌ చోక్సీ  కొన్ని షేర్లను బదలాయించగా వాటి ద్వారా కేవలం రూ.4.07 కోట్లు మాత్రమే రికవరీ జరిగింది. ఉద్దేశ పూర​‍్వకంగానే తమను తప్పు దారి పట్టించి నిధులు కాజేశారంటూ ఐఎఫ్‌సీఐ సీబీఐ తలుపు తట్టింది. మోహుల్‌ చోక్సీ వ్యవహారంలో ఐఎఫ్‌సీఐ ఖజానకు రూ.22 కోట్ల మేర కన్నం పడింది.

చదవండి: వాహనదారులకు భారీ షాక్..ఫిట్‌నెస్ సర్టిఫికెట్ లేకపోతే రూ.10వేలు జరిమానా, జైలుశిక్ష!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top