మరో బాదుడు.. కెనరా బ్యాంక్‌ రుణ రేటు పెంపు

Canara Bank Hikes Interest Rate Emi Goes Up For Existing Customers - Sakshi

ఇప్పటికే ఇందన ధరలు, నిత్యవసరాల ధరలు పెరగడంతో సామాన్య ప్రజలు అల్లాడిపోతున్నారు. గత నెలలో ద్రవ్యోల్బణం కట్టడిగా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రెపో రేటుని పెంచిన సంగతి తెలిసింది. ఈ క్రమంలో పలు బ్యాంకులు వారి వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకోవడం ప్రజలపై మరింత భారమనే చెప్పాలి. తాజాగా ప్రభుత్వ రంగంలోని కెనరా బ్యాంక్‌ నిధుల సమీకరణ వ్యయ ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్‌ఆర్‌)ను 0.15 శాతం వరకూ పెంచింది.

పెంచిన రేట్లు బుధవారం(సెప్టంబర్‌ 7) నుంచి అమల్లోకి వస్తాయని బ్యాంక్‌ పేర్కొంది. తాజా పెంపుతో ఎంసీఎల్‌ఆర్‌కు అనుసంధానమైన గృహ, వాహన, వ్యక్తిగత రుణాలు భారం కానున్నాయి. తాజా పెంపుతో ఏడాది రుణ రేటు 7.65 శాతం నుంచి 7.75 శాతానికి పెరిగింది. ఓవర్‌నైట్, నెల వ్యవధుల ఎంసీఎల్‌ఆర్‌ 0.10% మేర పెరిగింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top