కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు.. | Cabinet clears modified UDAN scheme with Rs 28840 crore outlay | Sakshi
Sakshi News home page

కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు..

Mar 25 2026 5:18 PM | Updated on Mar 25 2026 5:25 PM

Cabinet clears modified UDAN scheme with Rs 28840 crore outlay

ఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా ప్రాంతీయ విమాన కనెక్టివిటీని బలోపేతం చేయడం, వెనుకబడిన ప్రాంతాలలో విమానయాన మౌలిక సదుపాయాలను విస్తరించడం లక్ష్యంగా మొత్తం రూ.28,840 కోట్ల వ్యయంతో సవరించిన ఉడాన్ (ఉడే దేశ్ కా ఆమ్ నాగ్రిక్) పథకానికి కేబినెట్‌ ఆమోదం తెలిపినట్లు క్యాబినెట్ బ్రీఫింగ్ సందర్భంగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.

కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..

  • ఇమ్మిగ్రేషన్, వీసా, విదేశీయుల రిజిస్ట్రేషన్ ట్రాకింగ్ ప్రాజెక్టుకు క్యాబినెట్ ఆమోదం

  • జాతీయ భద్రత కోసం విదేశీయుల ట్రాకింగ్ వ్యవస్థ ఏర్పాటు

  • ఐవీఎఫ్‌ఆర్‌టీ  ప్రాజెక్టు కోసం 1800 కోట్ల రూపాయల ఖర్చుకు క్యాబినెట్ అనుమతి

  • ఉడాన్ 2.0 పథకానికి క్యాబినెట్ ఆమోదం

  • పదేళ్ల వ్యవధిలో 28,840 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్న ప్రభుత్వం

  • ఈ పథకం కింద కొత్తగా 100 విమానాశ్రయాల అభివృద్ధి

  • 200 హెలిపాడ్ ల ఆధునీకరణ

  • ఆపరేషన్ అండ్ మైంటెనెన్స్ కోసం 2,577 కోట్ల రూపాయల ఖర్చు చేయనున్న ప్రభుత్వం  

  • ఎయిర్ లైన్స్  ఆపరేటర్స్ కు వయబులిటీ  గ్యాప్ ఫండ్ కింద 10,043  కోట్ల రూపాయల సహాయం  

  • ఈ పథకం కింద కొత్తగా 120  ప్రాంతాలకు పెరుగనున్న ఎయిర్ కనెక్టివిటీ

  • పర్యావరణ పరిరక్షణ కోసం నేషనల్ డిటర్మైండ్ కాంట్రిబ్యూషన్ విధానానికి క్యాబినెట్ ఆమోదం  

  • సాంప్రదాయేతర ఇంధన వనరుల నుంచి 52 శాతం విద్యుత్ ఉత్పత్తి 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement