ఎయిర్‌పోర్ట్‌ విస్తరణకు రూ.2,869 కోట్లు Cabinet approved Rs 2869 crore for expansion of LB Shastri Airport in Varanasi. Sakshi
Sakshi News home page

ఎయిర్‌పోర్ట్‌ విస్తరణకు రూ.2,869 కోట్లు

Jun 20 2024 9:42 AM | Updated on Jun 20 2024 10:18 AM

Cabinet approved Rs 2869 crore for expansion of LB Shastri Airport in Varanasi

వారణాసిలోని లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయం విస్తరణకు కేంద్రమంత్రి వర్గం ఆమోదం తెలిపింది.

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్‌సభ నియోజకవర్గం  అయిన వారణాసిలోని లాల్ బహదూర్ శాస్త్రి ఎయిర్‌పోర్ట్‌ విస్తరణ కోసం రూ.2,869.65 కోట్లు వెచ్చించేందుకు మంత్రివర్గం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ నిధులతో కొత్త టెర్మినల్ బిల్డింగ్, ఆప్రాన్(విమానాలను పార్క్ చేయడానికి వీలుగా ఉండే ప్రాంత్రం), రన్‌వే విస్తరణ, ట్యాక్సీ ట్రాక్ నిర్మాణంతోపాటు ఇతర అనుబంధ పనులు చేస్తారని మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.

ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) ప్రతిపాదన ప్రకారంగానే రూ.2,869.65 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ఎయిర్‌పోర్ట్‌ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఏటా 39 లక్షల మంది ప్రయాణికులు ఈ విమానాశ్రయం ద్వారా రాకపోకలు సాగిస్తున్నారు. భవిష్యత్తులో ఈ సంఖ్య 99 లక్షలకు చేరేలా లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకోసం తాజా నిధులు ఎంతో ఉపయోగపడుతాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement