కేంద్ర బడ్జెట్‌ 2023: ఆ వాహనాలకు చెక్‌.. ఇకనైనా మేల్కోవాల్సిందే!

Budget 2023: Nirmala Sitharaman Allocates More Funds To Scrapping Of Old Vehicles - Sakshi

దేశప్రజలు కోటి ఆశలతో ఎదురుచూసిన కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌ ప్రసంగంలో ఆమె స్క్రాపేజ్ వెహికల్ పాలసీపై నొక్కి చెప్పారు. పాత వాహనాల రద్దుకు కేంద్ర ప్రభుత్వం మరిన్ని నిధులు కేటాయిస్తుందని తెలిపారు. 

కేంద్రం క్లీన్-ఎనర్జీ వాహనాలు అమ్మకాలను పెంచే ప్రయత్నంలో భాగంగా 15 సంవత్సరాల కంటే పాత వాహనాలను దశలవారీగా తొలగించాలని లక్ష్యం పెట్టుకున్న సంగతి తెలిసిందే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, రవాణా సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థల యాజమాన్యంలోని తొమ్మిది లక్షల వాహనాలను రద్దు చేసే ప్రణాళికలను ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో వాహనాల తుక్కు కోసం ఈ బడ్జెట్‌లో మరిన్ని నిధులు కేటాయించారు.

గతంలో భారత ప్రభుత్వం ‘వెహికల్ స్క్రాప్ పాలసీ’ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ విధానంలో దేశంలోని 15 ఏళ్ల నాటి వాహనాలను చెత్తకుప్పలకు పంపనుంది. ఈ పాలసీ ఏప్రిల్ 1 2023 నుంచి అమలులోకి రానుంది. వీటితో పాటు ప్రస్తుతం ఏ వాహనాలను స్క్రాప్‌ పాలసీ కిందకి వస్తుందనేని ప్రభుత్వం తన నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది. ఇక స్క్రాప్ కోసం పంపిన వాహనాలు రీసైకిల్ చేస్తారు. దీని నుండి మెటల్, రబ్బరు, గాజు మొదలైన అనేక వస్తువులు లభిస్తాయి. వీటిని వాహనాల తయారీలో మళ్లీ వాడుకలోకి వస్తుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top