Scammers Targeting Iphone Users: ఐఫోన్‌ యూజర్లకు హెచ్చరిక...!

Bitcoin Scammers Targeting Iphone Users Via Dating Apps - Sakshi

ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీపై భారీగానే ఆదరణ పెరుగుతుంది. క్రిప్టోకరెన్సీపై పెరుగుతున్న ఆదరణను కొంతమంది సైబర్‌ నేరస్తులు క్యాష్‌ చేసుకోవాలని చూస్తున్నారు.క్రిప్టోకరెన్సీ ఇన్వెస్టర్లపై హ్యకర్లు  దాడులకు పాల్పడుతున్నట్లుగా తెలుస్తోంది.  దాడికి గురవుతున్న వారిలో ఎక్కువగా ఐఫోన్‌ యూజర్లే ఉండడం గమనార్హం. తాజాగా బ్రిటన్‌కు చెందిన సైబర్‌ సెక్యూరిటీ సంస్థ సోఫోస్‌ ఐఫోన్‌ యూజర్లను హెచ్చరించింది.
చదవండి: ఈ స్మార్ట్‌ఫోన్‌ ధరను భారీగా పెంచిన వివో...!

డేటింగ్‌ యాప్స్‌తో దాడులు..!
బంబుల్‌, టిండర్‌ వంటి  డేటింగ్‌ యాప్స్‌తో క్రిప్టో స్కామర్లు ఐఫోన్‌ యూజర్లపై విరుచుకపడుతున్నట్లు సోఫోస్‌ పేర్కొంది. ఐఫోన్‌ యూజర్ల క్రిప్టోకరెన్సీలను దొంగలించడంతో పాటుగా, ఆయా వ్యక్తుల వివరాలను కూడా సేకరిస్తున్నారని సోఫోస్‌ తన నివేదికలో పేర్కొంది. ఇప్పటివరకు సుమారు రూ. 10 కోట్ల విలువైన క్రిప్టోకరెన్సీలను సైబర్‌ నేరస్తులు దొంగిలించారని  సోఫోస్‌ వెల్లడించింది. క్రిప్టో స్కామర్లు ఎక్కువగా ఆసియాలోని వ్యక్తులనే లక్ష్యంగా చేసుకున్నట్లు పేర్కొంది. ఈ స్కామర్లు యూరప్‌, యూఎస్‌ నుంచి తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నట్లు సోఫోస్‌ పేర్కొంది. 

క్రిప్టో ఇన్వెస్టర్లు సురక్షిత క్రిప్టో లావాదేవీలను సులభతరం చేయడానికి ఆపిల్ స్టోర్‌లో అందుబాటులో ఉన్న ధృవీకరించబడిన ఎక్స్ఛేంజ్, ట్రేడింగ్ సైట్‌లను మాత్రమే ఉపయోగించాలని సోఫోస్‌ సూచించింది. ఒక నివేదిక ప్రకారం.. 2020 ఏప్రిల్‌లో సుమారు 10.52 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 79,194 కోట్లు) మేర క్రిప్టోకరెన్సీ దొంగిలించబడిందని తెలుస్తోంది.
చదవండి: డ్రీమ్‌ హౌస్‌ షిఫ్టింగ్‌.. సముద్రంపై పడవలతో గమ్యానికి చేర్చి..! 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top