
ట్విట్టర్ కో–ఫౌండర్ జాక్ డోర్సె ‘బిట్‌చాట్’ అనే కొత్త మెసేజింగ్ యాప్‌ను లాంచ్ చేశాడు. వాట్సాప్, టెలిగ్రామ్‌లాగా దీనికి ఇంటర్‌నెట్ కనెక్టివిటీ అవసరం లేదు. మెసేజ్‌ను రిసీవ్ చేసుకోవడానికి, సెండ్ చేయడానికి బ్లూటూత్‌ను ఉపయోగిస్తుంది బిట్‌చాట్. ప్రస్తుతం ఇది యాపిల్ యూజర్‌లకు అందుబాటులో ఉంది. ఈ యాప్ ప్రస్తుతం పరిశీలన దశలో ఉన్నట్లు చెబుతున్నాడు డోర్సె. క్రౌడెడ్ ఏరియాలలో, ఇంటర్‌నెట్ యాక్సెస్‌ను బ్లాక్ చేసిన చోట బిట్‌చాట్ బాగా ఉపయోగపడుతుంది.