బిల్ గేట్స్‌కు ప్రతిష్టాత్మక పురస్కారం

Bill Gates FC Kohli get TiE Lifetime Achievement Award - Sakshi

బిల్‌ గేట్స్ కు ప్రతిష్ఠాత్మక టై గ్లోబల్ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు

ఫాదర్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఐటీ ఇండస్ట్రీ ఎఫ్‌సీ కోహ్లీకి 'జీవితకాల సాఫల్య పురస్కారం'

భారతీయ ఐటి పరిశ్రమకు పితామహుడిగా పిలుచుకునే దివంగత ఎఫ్‌సీ కోహ్లీ (మరణానంతరం), ప్రపంచ కుబేరుడు,  మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, దాత బిల్ గేట్స్  అరుదైన పురస్కారాన్ని  అందుకున్నారు.  'టై గ్లోబల్' అనే సంస్ కోహ్లీకి లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ సర్వీస్ అవార్డును ప్రదానం చేయగా, బిల్ గేట్స్ కు 'జీవితకాల సాఫల్య పురస్కారం' అవార్డుతో సత్కరించింది.  మారియట్ ఇంటర్నేషనల్‌కు చెందిన బిల్ మారియట్  లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ ఫ్యామిలీ బిజినెస్ ట్రాన్స్ఫర్మేషన్ అవార్డును అందుకున్నారు. గురువారం సాయంత్రం వర్చువల్ గా జరిగిన ‘‘గ్లోబల్‌ సమ్మిట్‌ 2020’’ కార్యక్రమంలో ది ఇండస్‌ వ్యవస్థాపకులు (టీఐఈ) ఈ అవార్డులను ప్రదానం చేసింది. టీసీఎస్‌  వ్యవస్థాపక సీఈవో దివంగత కోహ్లీ తరపున ఆయన భార్య  ఈ అవార్డును అందుకున్నారు.    (ఫాదర్‌ ఆఫ్‌ సాఫ్ట్‌వేర్‌ ఇండస్ట్రీ ఇక లేరు)

ప్రతి వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ లా ఉండాలనే కలకంటారని, కంప్యూటర్ టెక్నాలజీ అభివృద్దిలో ఆయన అద్భుతమైన కృషికి ఈ అవార్డు లభించిందని టీఐఈ గ్లోబల్ చైర్ మహావీర్ శర్మ వెల్లడించారు. అటు ఎంతో ప్రతిష్ఠాత్మకమైన 'టై గ్లోబల్' అవార్డును అందుకోవడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని గేట్స్‌ తన సందేశంలో తెలిపారు. ప్రపంచం ఎదుర్కొంటున్న కఠినమైన సవాళ్లను ఎదుర్కొనేందుకు ఆవిష్కరణలే కీలకమని అన్నారు. కరోనా మహమ్మారిని ఎదుర్కొనడంలోనూ ఆవిష్కరణలే ప్రధానభూమిక పోషిస్తాయన్నారు.

లైఫ్ టైం అచీవ్‌మెంట్ విభాగంలో మూడు అవార్డులతో పాటు,  వివిధ విభాగాల క్రింద పది అవార్డులను ఇచ్చింది. స్టార్టప్ ఎకోసిస్టమ్‌కు మద్దతు ఇచ్చే ఉత్తమ ప్రభుత్వ సంస్థ అవార్డును సింగపూర్ ప్రభుత్వం గెలుచుకుంది. ఇతర అవార్డులు: ఉత్తమ కార్పొరేట్ సహాయక వ్యవస్థాపకత (స్టార్టప్‌ల కోసం గూగుల్ / ఆల్ఫాబెట్); ఉత్తమ విశ్వవిద్యాలయం ప్రోత్సాహక వ్యవస్థాపకత (స్టాన్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం); ఉత్తమ యాక్సిలరేటర్ అవార్డు (వై కాంబినేటర్); ఉత్తమ పనితీరు గ్లోబల్ వీసీ ఫండ్ (సీక్వోయా క్యాపిటల్); ప్రపంచంలో అత్యంత చురుకైన ఏంజెల్ నెట్‌వర్క్ (టెక్ కోస్ట్ ఏంజిల్స్); బూట్స్ట్రాప్ టు బిలియన్స్ అవార్డు (బెన్ చెస్ట్‌నట్); రాపిడ్ లిస్టింగ్ అవార్డు (విఐఆర్ బయోటెక్నాలజీ), లైటనింగ్ యునికార్న్ అవార్డు (ఇండిగో అగ్రికల్చర్); మరియు మోస్ట్ ఇన్నోవేటివ్ స్టార్టప్ (డేటా రోబో) ఉన్నాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top