కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు.. కొత్త పథకానికి ఆమోదం | BHAVYA Scheme gets Cabinet nod Govt approves plug and play industrial parks plan | Sakshi
Sakshi News home page

కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు.. కొత్త పథకానికి ఆమోదం

Mar 18 2026 4:29 PM | Updated on Mar 18 2026 4:49 PM

BHAVYA Scheme gets Cabinet nod Govt approves plug and play industrial parks plan

ఢిల్లీ: కేంద్ర క్యాబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కొత్తగా భారత్ ఔద్యోగిక్‌ వికాస్ యోజన (భవ్య) పథకానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద 33,600 కోట్ల రూపాయల ఖర్చుతో 100 ప్లగ్ అండ్ ప్లే ఇండస్ట్రియల్ పార్క్స్ ఏర్పాటు చేస్తారు.

వంద నుంచి వెయ్యి ఎకరాల పరిధిలో ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేయనున్నారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో భవ్య ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటు జరగనుంది.  

అలాగే యూపీలో బారాబంకి నుంచి బహరాజ్ వరకు 101 కిలోమీటర్ల పొడవైన నాలుగు లైన్ల యాక్సిస్ కంట్రోల్ జాతీయ రహదారి నిర్మాణానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ జాతీయ రహదారి నిర్మాణానికి 6969 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది కేంద్ర ప్రభుత్వం.

ఇక పత్తి గిట్టుబాటు ధరల నిధికి 1718 కోట్ల రూపాయల కేటాయింపులకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 2023-24 పత్తి సీజన్లో ఎంఎస్పీ కోసం సీసీఐకి కేటాయింపునకు కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement