అద్దె ఇళ్ల కోసం వెతుకుతున్నారా? నిబంధనలు వింటే అవాక్ అవ్వాల్సిందే!

Bengaluru Housing Society's Bizarre Rules Leave Internet Fuming - Sakshi

సాధారణంగా సొసైటీలు, రెసిడెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ (ఆర్‌డబ్ల్యూఏ)లు నివసించే వారి సౌకర్యం కోసం నిబంధనలు విధిస్తుంటాయి. అయితే ఇప్పుడు వాటిల్లో కొన్ని విచిత్రమైన రూల్స్‌ నెటిజన్లను ఆగ్రహానికి గురి చేస్తున్నాయి. బెంగళూరులోని కుందనపల్లి గేట్‌ ఏరియా ప్రాంతానికి చెందిన రెసిడెంట్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ పెట్టిన కండీషన్స్‌ ఇలా ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా.. 

►బ‍్యాచిలర్స్‌, పెళ్లికాని వాళ్లు ఫ్లాట్లలోకి వచ్చేందుకు అనుమతి లేదు

►గెస్ట్‌లు ఎవరైనా రావాలంటే రాత్రి 10 గంటల తర్వాతే రావాలి

►ఒకవేళ వస్తే కారణాన్ని వివరిస్తూ ఓనర్‌, మేనేజర్‌, అసోసియేషన్‌ ఆఫీస్‌కు ఐడీ ఫ్రూప్‌తో పాటు అతిధులు ఎన్నిగంటలకు వస్తున్నారు. ఎంత సమయం ఉంటారో  మెయిల్‌ పెట్టి అనుమతి తీసుకోవాలి. 

►బ్యాచిలర్స్‌, పెళ్లికాని వాళ్లు తప్పని సరిగా అసోసియేషన్‌ విధించిన కండీషన్లకు కట్టుబడి ఉండాలి. లేదంటే రూ.వెయ్యి జరిమానా చెల్లించాల్సి ఉంటుంది

►రాత్రి 10 గంటల తర్వాత పెద్దగా మ్యూజిక్ సౌండ్‌ వినిపించకూడదు. లేట్‌ నైట్‌ పార్టీలు చేసుకోకూడదు. కారిడార్లు, బాల్కనీలల్లో ఫోన్‌ మాట్లాడకూడదనే కండీషన్లు పెట్టారంటూ బాధితులు వాపోతున్నారు. ఆ కండీషన్‌ల గురించి రెడ్డిట్‌లో పోస్ట్‌ చేశారు. 

దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. Marathalli సొసైటీలో అబ్బాయిలు, అమ్మాయిల ఫ్లాట్లలోకి వెళుతున్నారా? లేదా అని బ్యాచిలర్స్ ఫ్లాట్‌లను పర్యవేక్షిస్తారు. అతిథులు వెళ్లిపోయారా లేదా అని చూడటానికి  సెక్యూరిటీ గార్డ్‌లు బ్యాచిలర్స్ ఫ్లాట్‌లను చెక్‌ చేస్తున్నారంటూ ఓ యూజర్‌ కామెంట్‌ చేస్తున్నారు.  

‘ఇది హాస్టళ్ల కంటే దారుణం. మీరు ఫ్లాట్లలో ఉండేందుకు రెంట్‌ చెల్లిస్తున్నారు.రెంటల్ అగ్రిమెంట్‌ల ప్రకారం అద్దెకు తీసుకున్న కాలానికి ఇది మీ ఫ్లాట్. మీ ఫ్లాట్‌కి ఎవరు వస్తారు? బాల్కనీలో ఏం చేస్తారు? అనేది మీ ఇష్టం ఈ రోజుల్లో సొసైటీ నియమాలు అసహ్యంగా మారుతున్నాయి’ ఓ యూజర్ కామెంట్‌ చేస్తున్నారు.   

‘బ్యాచిలర్స్‌కు విధించిన నిబంధనలు మరింత జుగుప్సాకరంగా ఉన్నాయి. అందుకే నేను సొసైటీలలో ఉండడాన్ని ద్వేషిస్తున్నాను!  మరొక యూజర్ అన్నాడు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top