History And Behind The Making Of Surf Excel And Its Success Story In Telugu - Sakshi
Sakshi News home page

Surf Excel History Telugu: ఎవరీ లలితాజీ.. సర్ఫ్‌ ఎక్సెల్‌ వేలకోట్లు సంపాదించేందుకు ఎలా కారణమయ్యారు?

Published Sun, Jul 2 2023 4:57 PM | Last Updated on Mon, Jul 3 2023 2:42 PM

Behind The Making Of Surf Excel And Its Success Story - Sakshi

Surf Excel Success Story : ‘సస్తీ ఔర్ అచ్చీ చీజ్, దాగ్‌ అచ్చీ హై’ వంటి టీవీ ప్రకటనలంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది సర్ఫ్‌ ఎక్సెల్‌. చిన్న ప్యాకెట్‌తో మొదలైన సర్ఫ్‌ ఎక్సెల్‌ ప్రస్థానం నేడు అమ్మకాల్లో మాతృసంస్థ హెచ్‌యూఎల్‌కు చెందిన 50 రకాల ఉత్పత్తులను వెనక్కి నెట్టి అగ్రస్థానాన్ని కైవసం చేసుకోగలిగింది. అందుకు కారణాలేంటి? 

మనందరి ఇళ్లలో విస్తృతంగా వినియోగించే సర్ఫ్‌ ఎక్సెల్‌ భారతదేశపు మొట్టమొదటి డిటర్జెంట్ పౌడర్. హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ (HUL) 1957లో పెట్రోకెమికల్స్‌తో తయారు చేసిన ఎన్‌ఎస్‌డీ (నాన్-సోప్‌ డిటర్జెంట్) పౌడర్‌గా సర్ఫ్‌ను ప్రారంభించింది. గృహిణులు సౌకర్యంగా వినియోగించుకునేలా 1959లో హెచ్‌యూఎల్‌ సర్ఫ్‌ ఎక్సెల్‌ను మార్కెట్‌లో విడుదల చేసింది. సర్ఫ్ అని పిలిచే ఈ బ్రాండ్ దేశవ్యాప్తంగా ‘డిటర్జెంట్ పౌడర్’గా ప్రసిద్ధి చెందింది. అందుకు అనేక కారణాలున్నాయి.   

నురగ రావడం లేదని 
వాషింగ్‌ మెషీన్లు రాకముందు భారతీయులు బట్టల్ని ఉతకేందుకు సర్ఫ్‌ వినియోగం వల్ల పొందే ప్రయోజనాలు తెలిసినప్పటికీ సబ్బుల్ని మాత్రమే వాడే వారు. ఎందుకంటే అప్పట్లో సర్ఫ్‌ ఉపయోగిస్తే ట్యాప్‌ వాటర్‌తో బట్టల్ని ఉతికితే నురగ వచ్చేది కాదు. నురగవస్తే బట్టలకున్న మురికి పోతుందని నమ్మేవారు. ఆ నమ్మకమే సర్ఫ్‌ ఎక్సెల్‌ వినియోగంలో గృహిణులు విముఖత వ్యక్తం చేసేవారు. 

ప్రజల్ని నమ్మించి..
ఈ సమస్యనే ఛాలెంజింగ్‌ తీసుకున్న హెచ్‌యూఎల్‌ తమ ఉత్పత్తి సర్ఫ్‌ ఎక్సెల్‌ పెద్ద ఎత్తున ప్రచారానికి తెరతీసింది. బట్టల సోప్‌తో బట్టలు ఎలా శుభ్రం అవుతాయో.. ట్యాప్‌ వాటర్‌లో సర్ఫ్‌ ఎక్సెల్‌ను వినియోగిస్తే నురగ రావడమే కాదు, బట్టలు శుభ్రమవుతాయని ప్రజల్ని నమ్మించింది. బహిరంగంగా చేసి చూపించింది. ఫలితాలు రావడంతో ప్రజలు నమ్మారు. ప్రజల నమ్మకం, వ్యాపార ప్రకటనలతో సర్ఫ్‌ ఎక్సెల్‌ సేల్స్‌ అమాంతం పెరిగాయి.  

సర్ఫ్ ఎక్సెల్‌కు పోటీగా నిర్మా
అయితే  డిటర్జెంట్ ప్రొడక్ట్‌లలో సర్ఫ్ ఎక్సెల్ అమ్మకాలు, దాని మార్కెట్ వ్యాల్యూ విపరీతంగా పెరిగిపోవడంతో.. పోటీగా 1969లలో ‘నిర్మా’ వంటి ఇతర సంస్థలు సైతం డిటర్జెంట్ ఉత్పత్తుల్ని పోటా పోటీగా మార్కెట్‌లో విడుదల చేశాయి. అలా పోటీకి దిగిన నిర్మా..సర్ఫ్‌ ఎక్సెల్‌ అమ్మకాలకు చెక్‌ పెట్టింది. చనిపోయిన కూతురి జ్ఞాపకార్థం ఓ తండ్రి చేసిన ప్రయత్నంలో పుట్టుకొచ్చిన నిర్మా తక్కువ ధరలోనే ఆ కంపెనీకి చెందిన నిర్మా వాషింగ్‌ ఫౌడర్‌ కేజీ ప్యాకెట్ ధర రూ.3.50లకు అమ్మగా.. అదే సమయంలో హెచ్ యూఎల్ కంపెనీకి చెందిన సర్ఫ్ ఎక్సెల్ కేజీ సర్ఫ్ ఫౌడర్ ప్యాకెట్ ధర రూ.15కి అమ్మింది.

అంతలోనే నష్టాలు
దీంతో అప్పటి వరకు డిటర్జెంట్ విభాగంలో రారాజుగా వెలుగొందిన సర్ఫ్ ఎక్సెల్ అమ్మకాలు బాగా పడిపోయాయి. ధర ఎక్కువ కావడంతో సేల్స్‌ తగ్గాయి. హెచ్‌యూఎల్‌కు ఊహించని నష్టాలు వచ్చాయి. ఆ నష్టాల నుంచి గట్టెక్కేందుకు నిర్మాను ఢీ కొట్టి, నెంబర్ వన్ స్థానాన్ని చేజిక్కించుకునేందుకు సర్ఫ్ ఎక్సెల్ యాడ్ కోసం కవిత చౌదరీ (లలితాజీ) ని రంగంలోకి దించింది హెచ్ యూఎల్ బ్రాండ్.

ట్రెండ్ సెట్టర్‌గా లలితాజీ 
కవితా చౌదరితో వినియోగదారులకు సర్ఫ్ ఎక్సెల్ ‘సస్తీ ఔర్ అచ్చీ చీజ్’ (చౌక - మంచిది) యాడ్ క్యాంపెయిన్‌ను తయారు చేయించింది. నిర్మా సర్ఫ్ తక్కువ ధరలకు ప్రతి స్పందనగా ఇంటి పేరుగా మారితే.. సర్ఫ్ ఎక్సెల్ లలితాజీ యాడ్‌ డబ్బు విలువను వివరించేలా తీయడం అప్పట్లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. అంతే సర్ఫ్ ఎక్సెల్ బ్రాండ్ దశ తిరిగింది. డబ్బు విలువ చెబుతూ తీసిన యాడ్‌కు కొనుగోలు దారులు ఫిదా అయ్యారు. మళ్లీ సర్ఫ్ ఎక్సెల్స్‌ను వాడటం మొదలు పెట్టారు. ఇలా సర్ఫ్ ఎక్సెల్ డిటర్జెంట్ విభాగంలో దేశంలోనే తొలి బ్రాండ్ గా చరిత్ర సుష్టించడమే కాదు.. టీవీ చానల్స్‌లో యాడ్స్‌ను ప్రసారం చేయించిన బ్రాండ్లలలో సర్ఫ్ ఎక్సెల్ బ్రాండ్‌ తొలిస్థానంలో నిలిచింది.


30ఏళ్ల పాటు చక్రం తిప్పి 

30 ఏళ్ల పాటు డిటర్జెంట్‌ విభాగంలో చక్రం తిప్పిన సర్ఫ్‌ ఎక్సెల్‌కు నిర్మా తర్వాత 1991లో భారతీయ స్త్రీల అవసరాల్ని, ఆర్ధిక స్థాయిల్ని అర్ధం చేసుకున్న పీ అండ్ జీ సంస్థ ఎరియల్‌ను పరిచయం చేసింది. ఎయిరియల్‌ సైతం ధర తక్కువ కావడం, బకెట్‌ నీరు, వాషింగ్‌ మెషీన్‌లో వినియోగించుకొని బట్టల్ని శుభ‍్రం చేస్తుంది. మొండి మరకల్ని తరిమికొడుతుందంటూ చేసిన ఏరియల్‌ చేసిన ప్రయత్నాలు సఫలమయ్యాయి. ఇప్పటి వరకు సర్ఫ్‌ ఎక్సెల్‌, నిర్మాను వాడిని సామాన్యులు ఏరియల్‌ను వినియోగించుందుకు మొగ్గు చూపారు. 

ఈ సారి చిన్నపిల్లలతో 
దీంతో మళ్లీ పునారలోచనలో పడ్డ సర్ఫ్‌ ఎక్సెల్‌ ‘దాగ్ అచ్చే హై’ అంటూ మరో యాడ్‌ను రూపొందించింది. మరక మంచిదే నంటూ చిన్నపిల్లల తీసిన యాడ్‌లో..మీరే ఏదైనా మంచి పనిచేసినప్పుడు మరక అంటుకుంటే అది మంచిదే అని చెప్పడం మా ఉద్దేశం’ అని చెప్పడంలో మరో మారు తన మార్క్‌ సేల్‌ స్ట్రాటజీని అప్లయి చేయడం అది కాస్తా వర్కౌట్‌ అయ్యింది. ఇలా పదికి పైగా అడ్వటైజ్మెంట్స్‌తో పాటు ప్రజాదరణతో ఇండస్ట్రీలో సర్ఫ్‌ బ్రాండ్‌లలో సర్ఫ్‌ ఎక్సెల్‌ ప్రముఖ బ్రాండ్‌గా కొనసాగుతూ వస్తుంది. 

రూ.70,000 కోట్ల అమ్మకాల దిశగా 
ఇటీవల,హెచ్‌‌యుఎల్ డిటర్జెంట్ బ్రాండ్ సర్ఫ్ ఎక్సెల్ బిలియన్ డాలర్ల (దాదాపు రూ.8,282 కోట్లు) టర్నోవర్ మార్కును దాటేసింది. కంపెనీ పోర్ట్‌‌ఫోలియోలో ఈ మైలురాయిని దాటిన మొదటి బ్రాండ్‌‌గా ఎదిగింది. సబ్బులు, వాషింగ్​ పౌడర్లు, పేస్టుల వంటి ప్యాక్డ్ కన్జూమర్ గూడ్స్ మార్కెట్‌‌లో హెచ్​యూఎల్​  ఆధిపత్యం కొనసాగుతోందనడానికి సర్ఫ్​ ఎక్సెల్​ సక్సెస్​ నిదర్శనంగా నిలుస్తోంది. ఆ బ్రాండే హెచ్‌యూఎల్‌ సైతం ప్రీమియం ప్రొడక్ట్‌లను తయారు చేసేందుకు ఊతం ఇచ్చింది. వెరసీ బ్రాండ్  దేశం మొత్తం డిటర్జెంట్ల మార్కెట్‌లో అధిక షేర్‌ వాటాను సొంతం చేసుకుంది. ప్రస్తుతం సర్ఫ్‌ ఎక్స్‌ల్‌ డిమాండ్‌ను బట్టి 2027 నాటికి రూ.70,000 కోట్ల అమ్మకాలను అధిగమిస్తుందని అంచనా.

చదవండి👉 వచ్చేస్తోంది..ఇండియన్‌ రోడ్ల రారాజు..అంబాసీడర్‌ ఎలక్ట్రిక్‌ కార్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement