జూన్‌లో బ్యాంకులు పని చేసేది ఎన్ని రోజులంటే.. | Sakshi
Sakshi News home page

Bank Holidays: జూన్‌లో బ్యాంకులు పని చేసేది ఎన్ని రోజులంటే..

Published Sun, May 26 2024 4:52 PM

Bank Holidays In June 2024; Here's The Full List

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జూన్ నెలలో బ్యాంక్ సెలవుల జాబితాను విడుదల చేసింది. ఆర్‌బీఐ హాలిడే క్యాలెండర్ ప్రకారం ఈ నెలలో మొత్తం 12 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. ఈ మూసివేతలలో పబ్లిక్ సెలవులు, ప్రాంతీయ సెలవులు, రెండవ & నాల్గవ శనివారాలు.. అన్ని ఆదివారాలలో సాధారణ మూసివేతలు ఉన్నాయి.

జూన్ 2024లో సెలవుల జాబితా
2 జూన్ 2024 (ఆదివారం)-  తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం (తెలంగాణ)
8 జూన్ 2024 - రెండో శనివారం
9 జూన్ 2024 (ఆదివారం) - మహారాణా ప్రతాప్ జయంతి సందర్భంగా హిమాచల్ ప్రదేశ్, హర్యానా, రాజస్థాన్ బ్యాంకులకు సెలవు
10 జూన్ 2024 (సోమవారం) - శ్రీ గురు అర్జున్ దేవ్ మార్టిర్‌డమ్ డే సందర్భంగా పంజాబ్‌లో సెలవు.
14 జూన్ 2024 (శుక్రవారం) - పహిలి రాజా డే సందర్భంగా ఒడిశాలో బ్యాంకులకు సెలవు
15 జూన్ 2024 (శనివారం) - రాజా సంక్రాంతి సందర్భంగా ఒరిస్సాలో, YMA డే సందర్భంగా మిజోరం బ్యాంకులకు సెలవు
16 జూన్ 2024 - ఆదివారం
17 జూన్ 2024 (సోమవారం) - బక్రీద్ సందర్భంగా జాతీయ సెలవుదినం
21 జూన్ 2024 (శుక్రవారం) - వట్ సావిత్రి వ్రతం కారణంగా అనేక రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు
22 జూన్ 2024 (శనివారం) - సంత్ గురు కబీర్ జయంతి సందర్భంగా ఛత్తీస్‌గఢ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, పంజాబ్ బ్యాంకులకు సెలవు
23 జూన్ 2024 - ఆదివారం
30 జూన్ 2024 (ఆదివారం) - శాంతి దినోత్సవం (మిజోరం)

బ్యాంకులకు వెళ్లి చేసుకోవాల్సిన ఏదైనా అత్యవసరమైన పని చేసుకోవాలనుకునే వారు బ్యాంక్ హాలిడేస్ గమనించి ముందుగానే పనులు పూర్తి చేసుకోవాలి. అయితే ఆన్‌లైన్ సేవలు అన్నీ అందుబాటులో ఉంటాయి. 

(బ్యాంకింగ్ సెలవుల షెడ్యూల్‌ మారవచ్చు.. కాబట్టి హాలిడే క్యాలెండర్‌లో ఏవైనా అప్‌డేట్‌లు లేదా రివిజన్‌ల కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. లేదా మీ సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల అధికారిక ప్రకటనలను గమనించాల్సి ఉంటుంది.)
 

Advertisement
 
Advertisement
 
Advertisement