ప్రత్యేక డిపాజిట్‌ స్కీమ్‌: లక్ష డిపాజిట్‌ చేస్తే దాదాపు లక్షా 28 వేలు!

Bank of Baroda special scheme on Fixed Deposit Check details - Sakshi

6 శాతం వరకూ వడ్డీ ఆఫర్‌  

సీనియర్‌ సిటిజన్లకు 6.65 శాతం వరకూ వడ్డీ

ముంబై: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా  (బీఓబీ) 6 శాతం వరకూ అత్యధిక వడ్డీరేట్లను ఆఫర్‌ చేస్తూ, ‘బరోడా తిరంగా డిపాజిట్‌ పథకం’ పేరుతో ప్రత్యేక రిటైల్‌ టర్మ్‌ ప్లాన్‌ను ఆఫర్‌ చేసింది. అధిక వడ్డీ రేట్లను అందించే ప్రత్యేక టర్మ్‌ డిపాజిట్‌ పథకాన్ని తీసుకువచ్చినట్లు బ్యాంక్‌ ఒక ప్రకటనలో తెలిపింది. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా, వినియోగదారులకు అధిక వడ్డీరేటుతో తిరంగా డిపాజిట్ స్కీమ్ అందించడం సంతోషంగా ఉందనీ,  అత్యంత విశ్వసనీయ బ్యాంకులలో  బీఓబీ ఒకటని  బ్యాంక్ ఆఫ్ బరోడా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అజయ్ కె. ఖురానా ప్రకటనలో తెలిపారు. (ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్లకు అదిరిపోయే ఫీచర్లు..ఇక పండగే!)

2022 డిసెంబర్‌ 31 వరకూ ఈ స్కీమ్‌ అందుబాటులో ఉంటుంది. రూ.2 కోట్లలోపు రిటైల్‌ డిపాజిట్లకు ఈ పథకం వర్తిస్తుంది. ఈ స్కీమ్‌ కింద సీనియర్‌ సిటిజన్లు అదనపు వడ్డీ ప్రయోజనాన్ని పొందుతారు.

తిరంగా డిపాజిట్ స్కీమ్ వివరాల ప్రకారం,  555 రోజుల కాలవ్యవధికి  డిపాజిట్‌పై 6.15శాతం  వడ్డీని పొందవచ్చు. ఇందులో  సీనియర్ సిటిజన్లకు 0.5శాతం అదనపు వడ్డీని, నాన్‌-కాలబుల్‌  డిపాజిట్లకు 0.15 శాతం అదనపు వడ్డీని అందిస్తుంది. అంటే సీనియర్ సిటిజన్లు ఈ పథకం కింద నాన్-కాలబుల్‌  555 రోజుల డిపాజిట్‌ పై 6.65 శాతం వరకూ వరకు వడ్డీ లభిస్తుంది.

దీని ప్రకారం 555 రోజులకు రూ. 1 లక్ష  డిపాజిట్  చేస్తే మెచ్యూరిటీ సమయంలో రూ. 1.26 లక్షల కంటే ఎక్కువే పొందవచ్చు. అదే సీనియర్‌ సిటిజన్లకు మెచ్యూరిటీ మొత్తం రూ. 1.28 లక్షల కంటే ఎక్కువగా ఉంటుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top