Auto Expo 2023 ఈవీ సెగ్మెంట్‌లోకి మారుతి, ‘ఈవీఎక్స్’ కాన్సెప్ట్‌ ఎంట్రీ

Auto Expo 2023 Maruti Concept Electric SUV eVX Showcased - Sakshi

న్యూఢిల్లీ: ఆటో ఎక్స్‌పో 2023మారుతీ సుజుకీ ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలోకి  ఎంట్రీ ఇచ్చింది. గ్రేటర్ నొయిడా వేదికగా జరుగుతున్న ఆటో ఎక్స్‌పో 2023లో బుధవారం (జనవరి 11) తన తొలి ఎలక్ట్రిక్ ఎస్‍యూవీ ‘ఈవీఎక్స్’ కాన్సెప్ట్‌ను ఆవిష్కరించింది.  ‘మారుతీ సుజుకీ ఈవీఎక్స్ కాన్సెప్ట్‌’ ఎలక్ట్రిక్ కారు 2025లో మార్కెట్‍లోకి అందుబాటులోకి రానుంది.

అద్బుతమైన బ్యాటరీ పవర్డ్ ఆప్షన్‍తో ఫస్ట్ మోడల్‍ను తీసుకొస్తున్నట్టు  మారుతి సుజుకీ గ్రూప్ ప్రెసిడెంట్ తొషిహిరో సుజుకీ వెల్లడించారు. గరిష్టంగా 550 కిలోమీటర్ల డ్రైవింగ్ పరిధితో 60kWh బ్యాటరీని ఇందులో అందించింది.  మారుతి eVX SUV కాన్సెప్ట్ హ్యుందాయ్ క్రెటా కంటే పెద్దదిగా 2700mm పొడవైన వీల్‌బేస్‌ను అందిస్తుంది. టయోటా  40PL గ్లోబల్ ఆర్కిటెక్చర్ ఆధారంగా రూపొందించిన ఈ మోడల్ 27PL ప్లాట్‌ఫారమ్‌కు పునాదిగా పనిచేస్తుంది,. ముందు భాగంలో పదునైన గ్రిల్, హెడ్‌ల్యాంప్‌ల కోసం LED DRLలను కలిగి ఉంది. అదనంగా, EV కాన్సెప్ట్‌లో పెద్ద వీల్ ఆర్చ్‌లు, అల్లాయ్ వీల్స్, కూపేని పోలి ఉండే రూఫ్‌లైన్ ,మినిమల్ ఓవర్‌హాంగ్‌తో కూడిన షార్ప్లీ యాంగిల్ రియర్ ఉన్నాయి.

మారుతి  కొత్త మారుతి కాన్సెప్ట్ eVX  ఎలక్ట్రిక్ కారు టాటా నెక్సాన్ EVతో పోటీపడనుంది. మారుతి కాన్సెప్ట్ eVX  బేస్ మోడల్ ధర రూ. 13 లక్షలు ,టాప్ వేరియంట్‌ల ధర ఎక్కువగా రూ. 15 లక్షలుగా  ఉండనుంది. ఈవీఎక్స్ ఎస్‍యూవీ కాన్సెప్ట్ తోపాటు, గ్రాండ్ విటారా, ఎక్స్ఎల్6, సియజ్, ఎర్టిగా, బ్రెజా, వాగనార్ ఫ్యుయల్ ఫ్లెక్స్ ఫ్యుయల్, బలెనో, స్విఫ్ట్ ను ఇక్కడ ప్రదర్శించనుంది. 

మరిన్ని వార్తలు :

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top