ఛార్జింగ్ అవసరంలేని ఎలక్ట్రిక్ కారు! | Aptera Solar EV Does Not need Plug in Charge | Sakshi
Sakshi News home page

ఛార్జింగ్ అవసరంలేని ఎలక్ట్రిక్ కారు!

Apr 15 2021 7:54 PM | Updated on Apr 16 2021 1:21 AM

Aptera Solar EV Does Not need Plug in Charge - Sakshi

దేశంలో ఎలక్ట్రిక్ కార్ల డిమాండ్ రోజు రోజుకి పెరుగుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో ఈ మధ్య ఎక్కువ శాతం మంది ప్రజలు ఎలక్ట్రిక్ కార్లపై ఆసక్తి చూపుతున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలను కొనడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రోత్సహిస్తున్నాయి. అయితే, ఎలక్ట్రిక్ వాహనాలలో ఉన్న ప్రధాన లోపం ఛార్జింగ్ సమస్య. ఇవి పెట్రోల్ వాహనాలలో పెట్రోల్ పోసినంత సులభంగా ఛార్జింగ్ కావు. ఇప్పటికే ఈ సమస్యను పరిష్కరించడానికి అనేక కంపెనీలు దాని మీద దృష్టి పెట్టాయి. 

తాజాగా అమెరికాకు చెందిన ఒక స్టార్ట్-అప్ కంపెనీ ఛార్జింగ్ అవసరం లేని ఒక కారును తయారు చేసింది. అది ఎలా అని అనుకుంటున్నారా? సూర్యశక్తి సహాయంతో బ్యాటరీ ఛార్జ్ అయ్యేలా కారును ఆప్టెరా అనే ఒక స్టార్ట్-అప్ రూపొందించింది. ఆప్టెరా పారాడిగ్మ్ అనేది సౌర ఎలక్ట్రిక్ కారు పేరు. దీని అతిపెద్ద లక్షణం ఏమిటంటే ఇది ఎప్పటికీ ఛార్జ్ పెట్టాల్సిన అవసరం లేదు. సౌర శక్తితో రహదారిపై బ్యాటరీ ఛార్జింగ్ అవుతుంది. ఈ ఎలక్ట్రిక్ కారు మరో ప్రత్యేకత ఏమిటంటే, కేవలం 3.5 సెకన్లలో ఈ కారు సున్నా నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. 

కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం, దీని గరిష్ట వేగం గంటకు 177 కిలోమీటర్లు. ఆప్టెరా పారాడిగ్మ్ కారు ఫుల్ ఛార్జ్ అయిన తర్వాత ఈ కారు 1000 మైళ్ళు అంటే 1600 కిలోమీటర్లు నడపవచ్చు. ఆప్టెరా ఇటీవలే తన సోలార్ ఎలక్ట్రిక్ కారును ప్రీ-ఆర్డర్స్ పై అందిస్తుంది. ఈ కారు చూడటానికి ముంగిస ఆకారంలో ఉంది. దీనిలో ఇద్దరు కలిసి ప్రయాణించవచ్చు. గత సంవత్సరం ఈ కారును సేల్ కి తీసుకొచ్చినప్పుడు 8 రోజుల్లో మూడు వేలకు పైగా ఆర్డర్స్ లభించాయి. పారాడిగ్మ్ ధర 29,000 డాలర్లు కాగా, పారాడిగ్మ్ ప్లస్ ధర 46,900 డాలర్లు.

చదవండి: గుడ్‌న్యూస్‌: త్వరలో పెట్రోల్, డీజిల్‌పై పన్ను తగ్గింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement