‘పెగాసస్‌’ తర్వాత తీరుమారని ఎన్‌ఎస్‌వో.. వేల కోట్ల మంది డేటా టార్గెట్‌! గతంలోనూ అంతే!!

Apple Sued Israel NGO Group Over Pegasus Surveillance Scandal - Sakshi

Pegasus surveillance scandal: పెగాసస్‌ స్కామ్‌కు సంబంధించిన వ్యవహారంలో యాపిల్‌ కంపెనీ ఎట్టకేలకు స్పందించింది. కోట్ల మంది ఐఫోన్‌ యూజర్ల డేటాను ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎస్‌వో గ్రూప్‌ లక్క్ష్యంగా చేసుకుందంటూ మంగళవారం కాలిఫోర్నియా కోర్టులో దావా వేసింది యాపిల్‌.  ఇప్పటికే పెగాసస్‌ స్పైవేర్‌ ద్వారా కోట్లమంది ఐఫోన్‌ యూజర్ల డేటాను హ్యాకర్లకు చేర్చిందని సదరు దావాలో యాపిల్‌ పేర్కొంది. 

ఇజ్రాయెల్‌కు చెందిన టెక్నాలజీ కంపెనీ ఎన్‌ఎస్‌వో గ్రూప్‌..  పెగాసస్‌ స్పైవేర్‌ను ఇతర దేశాలకు అమ్ముతుంటుంది. అయితే ప్రభుత్వాలు మాత్రమే మెయింటెన్‌ చేసే ఈ స్పైవేర్‌ను.. హ్యాకర్లు లక్క్ష్యం చేసుకున్నారని, పలువురు ప్రముఖుల ఫోన్‌ డేటాను తస్కరించారనే ఆరోపణలతో ‘పెగాసస్‌ స్కామ్‌’ వెలుగుచూసింది. పైగా యాపిల్‌ ఫోన్లు వాడే ప్రముఖుల డేటా లక్క్ష్యం అయ్యిందని, భవిష్యత్తులోనూ ఐఫోన్లు వాడేవాళ్ల డేటా తేలికగా హ్యాకింగ్‌కు గురయ్యే అవకాశం ఉందని ఉటంకించింది.

 

Pegasus surveillance scandal నేపథ్యంలోనే మంగళవారం స్పైవేర్‌ మేకర్‌ ఎన్‌ఎస్‌వోపై దావా వేసింది. పెగాసస్‌ స్పైవేర్‌పై అమెరికా ఆంక్షలు విధించిన రెండు వారాలకే యాపిల్‌ ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. అంతేకాదు ఎన్‌ఎస్‌వో గ్రూప్‌ యాపిల్‌కు సంబంధించి ఎలాంటి డివైజ్‌లను,  సాంకేతికతను, సేవలను, వినియోగించకుండా ఆదేశాలు జారీ చేయాలంటూ ఫెడరల్‌ కోర్టును యాపిల్‌ అభ్యర్థించింది. అంతేకాదు తమ ఫోన్‌ డేటా కూడా చోరీకి గురయ్యే అవకాశం ఉందన్న భయాందోళనను తాజా సర్వేలో పలువురు యూజర్లు వ్యక్తం చేశారని యాపిల్‌ దావాలో పేర్కొంది.

   

అయితే పెగాసస్‌ స్కామ్‌ వెలుగులోకి వచ్చినప్పటి నుంచి(భారత్‌కు చెందిన పలువురు రాజకీయ నేతలు, జర్నలిస్టులు, సెలబ్రిటీల పేర్లు కూడా!).. ఆరోపణల్ని ఎన్‌ఎస్‌వో గ్రూప్‌ ఖండిస్తోంది. పెగాసస్‌ స్పైవేర్‌ హ్యాకింగ్‌కు గురయ్యే అవకాశమే ఉండదని స్పష్టం చేసింది.  లీక్‌ డేటా బేస్‌లో నెంబర్లు కనిపించినంత మాత్రనా డేటా హ్యాక్‌ అయినట్లు కాదని గుర్తించాలని తెలిపింది. తప్పుడు కథనాలు ప్రచురించిన వార్తా సంస్థలపై పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించింది కూడా.  అయినప్పటికీ వివాదం ముదురుతూనే వచ్చింది.

ఇక ఎన్‌ఎస్‌వోకి ఇలాంటి దావాలు కొత్తేం కాదు. 2019లో ఫేస్‌బుక్‌ కూడా దావా వేసింది. వాట్సాప్‌ మెసేంజర్‌ ద్వారా సైబర్‌ గూఢచర్యానికి పాల్పడిందని, జర్నలిస్టులు, మానవ హక్కుల సంఘం ఉద్యమకారుల డాటాను తస్కరించిందనే ఆరోపణలు చేస్తూ కాలిఫోర్నియా ఫెడరల్‌ కోర్టులోనే ఫేస్‌బుక్‌ దావా వేసింది.  దావాలు చాలవన్నట్లు 500 మిలియన్‌ డాలర్ల అప్పుల్లో కూరుకుపోయి.. డిఫాల్ట్ ప్రమాదానికి చేరువలో ఉంది. మరోవైపు అమెరికా ఆంక్షల తర్వాత భారీ కొనుగోళ్ల ఒప్పందం నుంచి ఫ్రాన్స్‌ సైతం వెనుదిరిగింది.

చదవండి: ఐఫోన్‌ యూజర్లకు హైఅలర్ట్‌! వెంటనే..

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top