15వేలకే యాపిల్‌ 4కే టీవీ, అదిరిపోయే ఐప్యాడ్‌, ఐప్యాడ్‌ ప్రో

Apple New gen TV 4K launched along with iPad iPad Pro M2 - Sakshi

సాక్షి,ముంబై:  టెక్‌ దిగ్గజం యాపిల్‌  న్యూ జనరేషన్‌ యాపిల్‌  4కే టీవీని లాంచ్‌ చేసింది. ఈ టీవీ ప్రారంభ ధర రూ 14,900గా ఉంచింది. దీంతోపాటు 5జీ సరికొత్త ఐప్యాడ్, ఐప్యాడ్‌ప్రో (ఎం2చిప్‌సెట్‌) విడుదల చేసింది. ముఖ్యంగా ఫుల్ స్క్రీన్ డిస్ ప్లేతో అదిరిపోయే లుక్‌లో ఈ ప్యాడ్‌ను తీసుకొచ్చింది. 

యాపిల్‌  4కే టీవీ 
డాల్బీ విజన్‌తో పాటు HDR 10+కి మద్దతుతో సిరి రిమోట్‌, USB Type-C పోర్ట్‌ను ఇందులో జోడించింది. రెండు కాన్ఫిగరేషన్‌లలో లాంచ్‌ చేసింది. వేగవంతమైన నెట్‌వర్కింగ్ , స్ట్రీమింగ్ కోసం వైఫై ఈథర్‌నెట్‌ సపోర్ట్‌తో 64 జీబీ స్టోరేజ్‌. రెండోది యాప్‌లు, గేమింగ్‌ కోసం 128 జీబీ స్టోరేజ్‌తో తీసుకొచ్చింది. దీని ప్రారంభ ధర 16,900. ఇంట్లోనే అతిపెద్ద స్క్రీన్‌పై తమకు ఇష్టమైన వినోదాన్ని ఆస్వాదించే లక్క్ష్యంతో  గతంలో కంటే మరింత శక్తివంతంగా దీన్ని లాంచ్‌ చేసినట్టు వైస్ ప్రెసిడెంట్ బాబ్ బోర్చర్స్ అన్నారు. ఈటీవీలు ఆపిల్ ఇండియా వెబ్‌సైట్‌లో ప్రీ-ఆర్డర్‌కు  అందుబాటులో ఉండగా, షిప్పింగ్ నవంబర్ 4 నుండి ప్రారంభం.

ఫుల్ స్క్రీన్ డిస్ ప్లేతో ఐప్యాడ్
ఫుల్‌ ఆల్ స్క్రీన్ తో  సిల్వర్, బ్లూ, ఎల్లో, పింక్ నాలుగు కొత్త రంగుల్లో కొత్త  10వ తరం ఐప్యాడ్ అందుబాటులో ఉండనుంది. మొత్తం నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఐప్యాడ్ 2022 వైఫై 64 జీబీ మోడల్ ధర రూ. 44,900 గాను, వైఫై 256 జీబీ వేరియంట్ ధర రూ. 59,900గా ఉంది. అలాగే వైఫై + సెల్యులార్ 64 జీబీ మోడల్ ధర రూ. 59,900 గాను, వైఫై + సెల్యులార్ 256 జీబీ ధర రూ. 74,900 గా ఉంది. 

ఐప్యాడ్ స్పెసిఫికేషన్స్ 
10.9 ఇంచ్ లిక్విడ్ రెటీనా డిస్ ప్లే
ఏ14 బయోనిక్ చిప్ సెట్
ఐప్యాడ్ ఓఎస్ 16 ఆపరేటింగ్ సిస్టమ్
12 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా
12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ రియర్‌  కెమెరా
4కే వీడియో సపోర్ట్

ఈ ఐప్యాడ్ కి సంబందించిన ప్రీ ఆర్డర్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.  యాపిల్‌ వెబ్‌సైట్  ప్రీబుకింగ్‌ చేసుకోవచ్చు. అక్టోబర్ 26నుంచి డెలివరీ  ప్రారంభమవుతుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top