iPhone Pre-Bookings: Sangeetha Mobiles is Offering Best Offers on Apple Phones | ఐఫోన్స్‌ ప్రీబుకింగ్‌పై ‘సంగీత’ భారీ ఆఫర్లు - Sakshi
Sakshi News home page

ఐఫోన్స్‌ ప్రీబుకింగ్‌పై ‘సంగీత’ భారీ ఆఫర్లు

Oct 27 2020 9:05 AM | Updated on Oct 27 2020 4:15 PM

 Apple Iphone prebookings Sangeetha best offers  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కొత్తగా భారత్‌ మార్కెట్లోకి రానున్న ఆపిల్ ఐఫోన్‌ 12, 12 ప్రో మొబైళ్ల ప్రీబుకింగ్‌పై సంగీత మొబైల్స్‌ ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించింది. హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్‌/క్రిడెట్‌ కార్డు మీద ఐఫోన్‌ 12, 12 ప్రో మొబైళ్లపై రూ.6 వేల క్యాష్‌బ్యాక్, 6 నెలలపాటు వడ్డీలేని వాయిదాలను చెల్లించవచ్చు. కార్డు లేని వారు ఫోన్‌ ఎక్స్జేంజ్ చేస్తే దాని ప్రస్తుత విలువతో పాటు మరో రూ.ఆరు వేలు అదనంగా చెల్లించనున్నారు. ప్రీబుక్‌ చేసే తొలి 1000 మంది కస్టమర్లకు సంస్థ నుంచి ఒక గోల్డ్‌కాయిన్‌ బహుమతిగా అందుతుంది. జీఎస్‌టీఐఎన్‌ నంబర్‌ ఉన్న వారు ఐ ఫోన్లను కొంటే 18శాతం  జీఎస్‌టీ రీఫండ్‌ అవుతుంది. ఇక్కడ కొంటే ఆపిల్‌ కేర్‌ మీద 50 శాతం డిస్కౌంట్‌ ఇస్తుంది. పండుగ సీజన్‌ సందర్భంగా ఇతర మొబైల్‌ బ్రాండ్లు, ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్లపై అతి తక్కువ ధరకు, విన్నూత ఆఫర్లతో కస్టమర్లకు అందిస్తామని ఎండీ సుభాష్‌ చంద్ర తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement