Apple Bans Malicious Spyware Capable of Calling, Taking Photos - Sakshi
Sakshi News home page

Apple: యాపిల్‌ ఐఫోన్‌ వినియోగదారులకు అలెర్ట్‌!

Published Sun, Jul 3 2022 4:53 PM

Apple bans malicious spyware - Sakshi

యాపిల్‌ ఐఫోన్‌ వినియోగదారులకు అలెర్ట్‌. ఐఫోన్‌లపై దాడి చేస్తున్న ప్రమాదకరమైన ఐఫోన్‌ యాప్స్‌ను యాపిల్‌ బ్లాక్‌ చేసింది. అంతేకాదు ఐఫోన్‌లపై దాడులు చేసేందుకు ఎలాంటి మాల్వేర్‌ను తయారు చేశారు. ఎవరు తయారు చేశారనే విషయాలు సైతం వెలుగులోకి వచ్చాయి.  

గూగుల్‌కు చెందిన 'థ్రెట్ అనాలిసిస్ గ్రూప్' (టీఏజీ ) హ్యాకింగ్, దాడుల్ని గుర్తిస్తుంది. తాజాగా విడుదలైన ఓ నివేదిక ప్రకారం..ఇటాలియన్‌ సాఫ్ట్‌ వేర్‌ సంస్థ ఆర్సీఎస్‌ తయారు చేసిన  'హెర్మిట్' అనే స్పైవేర్‌ ఐఫోన్‌లపై దాడి చేసి..ఆఫోన్‌ పనితీరు ఆగిపోయేలా చేస్తుంది.ఈ స్పైవేర్ మీ ఫోన్‌లో ఎంటర్‌ అయ్యిందంటే చాలు హ్యాక్‌ చేయడం,ఆడియోను రికార్డ్ చేయడం, అనధికారిక కాల్స్‌ లిఫ్ట్‌ చేయడం, ఈమెయిల్‌లు చెక్‌ చేయడం, మెసేజెస్‌ చదవడం, మీరు ఏ వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేశారో తెలుసుకోవడం, కెమెరాను హ్యాక్‌ చేస్తున్నట్లు ట్యాగ్‌ గ్రూప్‌ గుర్తించింది.  

అంతేకాదు విచిత్రంగా ఐఫోన్‌లలోకి ఎంటర్‌ అయ్యే ఈ వైరస్‌ గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి కానీ యాపిల్‌ స్టోర్‌ నుంచి సాధ్యపడదని సదరు రిపోర్ట్‌లో పేర్కొంది. సైడ్‌ లోడింగ్‌ ద్వారా ఐఫోన్‌లలోకి ఎంటర్‌ అవుతున్నట్లు నివేదిక నిర్ధారించింది. సైడ్‌లోడింగ్‌ అంటే యూఎస్‌బీ, బ్లూటూత్, వైఫై లాంటి ఇతర పద్ధతుల ద్వారా స్మార్ట్‌ఫోన్‌కు బదిలీ చేసే సామర్ధ్యం ఉన్న మీడియా ఫైల్స్‌ ద్వారా ఫోన్‌లపై అటాక్‌ చేస్తున్నట్లు తేలింది. ఈ సందర్భంగా యాపిల్‌ సంస్థ ఐఫోన్‌ వినియోగదారుల్ని హెచ్చరించింది. డేటా షేరింగ్‌ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించింది. 

Advertisement

తప్పక చదవండి

Advertisement