Amazon: ఆపిల్ ఉత్పత్తులపై భారీ తగ్గింపు..!

ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ సోమవారం ఆపిల్ డేస్ సేల్‌ను ప్రకటించింది. ఆపిల్ ఉత్పత్తులపై భారీ ఆఫర్లను అమెజాన్ అందిస్తోంది. కొనుగోలుదారులకు ఆపిల్ డేస్ సేల్ జూలై 17 శనివారం వరకు అందుబాటులో ఉండనుంది. ఈ సేల్‌లో భాగంగా ఐఫోన్ 12 సిరీస్, ఐఫోన్ 11, ఇతర ఆపిల్ ఉత్పత్తులపై డిస్కౌంట్లను అమెజాన్ అందించనుంది. ఆపిల్ డేస్ సేల్‌లో ఐఫోన్ 12 బేసిక్ ఫోన్‌ను రూ. 9,000 తగ్గింపుతో రూ .70,900 వినియోగదారులకు అందుబాటులో ఉండనున్నాయి.
వినియోగదారులు ఇతర ఆపిల్ ఉత్పత్తులపై హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్ కార్డులతో చేసే లావాదేవీలపై సుమారు రూ. 6,000 అదనపు తగ్గింపును పొందవచ్చును. ఆపిల్ ఐప్యాడ్ మినీ, మాక్‌బుక్ ప్రో, ఇతర ఉత్పత్తులపై ఆఫర్లను కూడా తీసుకురాబోతోంది. ఆపిల్ డేస్ సేల్ సమయంలో ఐఫోన్ ఎక్స్ మాక్స్ నుంచి ఐఫోన్ 6 ఎస్ వరకు ఐఫోన్ మోడళ్లపై డిస్కౌంట్ పొందవచ్చునని అమెజాన్ పేర్కొంది. ఆపిల్ ఐఫోన్ 8 ప్లస్, ఐఫోన్ 8, ఐఫోన్ 7, ఐఫోన్ ఎక్స్‌ఆర్, ఐఫోన్ ఎక్స్ ఇతర ఆపిల్ మోడళ్లకు ఆన్‌లైన్‌లో తగ్గింపు ధరలకు అమెజాన్ ప్రకటించింది. అమెజాన్ తన కస్టమర్లకు ‘ప్రైమ్ డే సేల్’ను ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రైమ్ డే సేల్ జూలై 26 నుంచి జూలై 27 వరకు సేల్ జరగనుంది.