Alibaba Lays: అలీబాబా షాకింగ్‌ నిర్ణయం.. అయ్యో ఎంత పనిచేసింది!

Alibaba lays off nearly 10k employees to cut expenses amid poor sales - Sakshi

న్యూఢిల్లీ: గ్లోబ‌ల్ ఈ-కామ‌ర్స్ దిగ్గ‌జం అలీబాబా అధినేత, బిలియనీర్ జాక్ మా  త‌న ఉద్యోగుల‌కు భారీ  షాక్ ఇచ్చారు. దాదాపు 10వేల మంది ఉద్యోగులకుఉద్వాసన పలికినట్టు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. ఒకవైపు ప్రభుత్వం నుంచి తీవ్ర ఒత్తిడి, మరోవైపు  అమ్మకాలు  క్షీణించి, భారీ నష్టాల కారణంగా ఈ షాకింగ్‌ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.  ప్రపంచంలోనే అతిపెద్ద ఇ-కామర్స్ మార్కెట్ చైనాలో  తీవ్ర ఆంక్షలు, నష్టాలు, ఆర్థిక మాంద్యం  ఆందోళనల నేపథ్యంలో  కాస్ట్‌కటింగ్‌లో భాగంగా  ఉద్యోగులపై వేటు వేయడం ఆందోళన రేపింది.  (మీరు పీఎఫ్‌ ఖాతాదారులా? యూఏఎన్‌ నెంబరు ఎలా పొందాలో తెలుసా?)

అలీబాబా గ్రూప్ అనుబంధ సంస్థ, సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్  ఈ విషయాన్ని రిపోర్ట్‌ చేసింది. జూన్ త్రైమాసికంలో 9,241కు పైగా  ఉద్యోగులను  తొలిగించింది. దీంతో   కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య 245,700కి పడిపోయింది. అంతేకాదు  2016  మార్చి తరువాత సంస్థ ఉద్యోగుల‌ను తొల‌గించడం ఇదే తొలిసారి. మరోవైపు జూన్ త్రైమాసికంలో అలీబాబా నికర ఆదాయం 50 శాతం తగ్గి 22.74 బిలియన్ యువాన్లకు (3.4 బిలియన్లు డాలర్లు) గత ఏడాది ఇదే కాలంలో 45.14 బిలియన్ యువాన్ల నుండి తగ్గింది. అయితే ఈ ఏడాది దాదాపు 6 వేల ఫ్రెష్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్‌లను తమ హెడ్‌కౌంట్‌లో చేర్చుకోనున్నట్లు అలీబాబా చైర్మన్, సీఈఓ డేనియల్ జాంగ్ యోంగ్ తెలిపారు. (పొద్దున్నే ఆ వాసన భలే ఉంది: ఎలాన్‌ మస్క్‌ భారీ ప్లాన్లు!)

కాగా 1999లో స్థాపించిన అలీబాబా  గ్రూపు చైనాలో తిరుగులేని సంస్థగా రాణించింది.  సంస్థ పునర్వవస్థీకరణలో భాగంగా  2015లో డేనియల్ జాంగ్‌కు  సీఈఓగా ,2019లో ఛైర్మన్‌గా బాధ్యతలను అప్పగించారు  జాక్‌ మా.   చైనా ప్రభుత్వం,  నియంత్ర‌ణ సంస్థ‌ల‌పైనా అలీబాబా ఫౌండ‌ర్ జాక్‌మా విమ‌ర్శ‌లు నేపథ్యంలో అలీబాబా, ఆంట్ గ్రూప్‌ల‌ సంస్థ‌ల‌ను అక్కడి ప్రభుత్వం టార్గెట్‌ చేసింది. గత నెలలో, ప్రభుత్వ  దర్యాప్తు సంస్థల  ఒత్తిడి మధ్య  జాక్‌మా యాంట్ గ్రూప్‌పై తన నియంత్రణను వదులుకోవాలనే యోచనలో ఉన్నట్టు వాల్ స్ట్రీట్ జర్నల్‌ నివేదించిది.ఓటింగ్  పవర్‌ను చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎరిక్ జింగ్‌తో సహా ఇతర యాంట్ అధికారులకు బదిలీ  చేయాలని  భావిస్తున్నట్టు సమాచారం. 
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top