ఎయిర్‌టెల్‌ కస్టమర్లకు గుడ్‌ న్యూస్‌.. కొత్త సేవలు రాబోతున్నాయ్‌!

Airtel Payment Bank To Install More Than 1 Lakh  Micro Atms Fiscal - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ మైక్రో ఏటీఎంల ఏర్పాటు కు శ్రీకారం చుట్టింది. వీటి ద్వారా కస్టమర్‌ ఒక్కో లావాదేవీకి గరిష్టంగా రూ.10,000 నగదు స్వీకరించవచ్చు. ఇందుకోసం ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌నకు చెందిన బ్యాంకింగ్‌ కరెస్పాండెంట్స్‌ సాయం తీసుకోవాల్సి ఉంటుంది. అన్ని బ్యాంక్‌లకు చెందిన డెబిట్‌ కార్డుల ద్వారా కస్టమర్లు ఈ సేవలను పొందవచ్చు. ఖాతా నిల్వ తెలుసుకోవచ్చు.


ద్వితీయ శ్రేణి నగరాలు, ఉప పట్టణ ప్రాంతాల్లో దశలవారీగా దేశవ్యాప్తంగా 2023 మార్చి నాటికి 1.5 లక్షల మైక్రో ఏటీఎంలను అందుబాటులోకి తేనున్నట్టు బుధవారం బ్యాంక్‌ ప్రకటించింది. ఏటీఎంలు తక్కువగా ఉండి, నగదు అవసరాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వీటిని పరిచయం చేస్తామని వెల్లడించింది.

మైక్రో ఏటీఎం లావాదేవీలు జరిపేందుకు వీలుగా నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, నేషనల్‌ ఫైనాన్షియల్‌ స్విచ్‌తో ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ అనుసంధానమైంది.

గ్రామీణ ప్రాంతంలో ఉన్న వినియోగదార్లను శక్తివంతం చేసేందుకే ఈ కార్యక్రమానికి శ్రీ కారం చుట్టామని ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ సీవోవో అనంతనారాయణన్‌ తెలిపారు.

చదవండి: స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాల్లో కొత్త రూల్స్‌ వచ్చాయ్‌.. ఇది తప్పనిసరి!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top