Air India Offers To Rehire Pilots Post-Retirement For 5 Years - Sakshi
Sakshi News home page

Air India: ఎయిర్‌ ఇండియా ఉద్యోగులకు టాటా గ్రూప్‌ శుభవార్త!

Jun 24 2022 8:15 PM | Updated on Jun 24 2022 8:32 PM

Air India Re Hire Pilots Post Retirement For 5 Yrs - Sakshi

ముంబై: టాటా గ్రూపులో భాగమైన ఎయిర్‌ ఇండియా రిటైర్మెంట్‌ తర్వాల పైలట్లను మరో ఐదేళ్లపాటు తిరిగి విధుల్లో నియమించుకునేందుకు నిర్ణయం తీసుకుంది. కార్యకలాపాల్లో స్థిరత్వం కోసం ఈ విధానమని సంస్థ వర్గాలు తెలిపాయి.

రిటైర్మెంట్‌ అయిన వెంటనే పైలట్లను కమాండర్లుగా ఐదేళ్ల కాలానికి లేదా 65 ఏళ్లు వచ్చే వరకు (ఏది ముందు అయితే అది) నియమించుకోనున్నట్టు ఎయిర్‌ ఇండియా డిప్యూటీ జీఎం వికాస్‌ గుప్తా అంతర్గత ఈ మెయిల్‌లో పేర్కొన్నారు. ఎయిర్‌ ఇండియా తన సేవలను దేశీ, విదేశీ మార్గాల్లో పెద్ద ఎత్తున విస్తరించే ప్రణాళికలతో ఉంది.

ఇందులో భాగంగా 300 విమానాలకు ఆర్డర్‌ చేసే సన్నాహాలతో ఉంది. దీంతో రిటైరైన పైలట్ల సేవలను వినియోగించుకోవాలని భావిస్తున్నట్టు తెలిసింది. మరోవైపు ఎయిర్‌ ఇండియా తన ఉద్యోగులకు స్వచ్చంద పదవీ విమరణ పథకాన్ని ప్రకటించడం తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement