షావోమీదే పైచేయి.. శాంసంగ్‌ వెనుకంజ

Again Xiomi Surpassed Samsung In Q3 Sales - Sakshi

క్యూ4లో తగ్గనున్న స్మార్ట్‌ఫోన్‌ విక్రయాలు: ఐడీసీ

సరఫరా సమస్యలు కారణం!  

న్యూఢిల్లీ: సరఫరాపరమైన సవాళ్ల కారణంగా డిసెంబర్‌ త్రైమాసికంలో (క్యూ4) దేశీయంగా స్మార్ట్‌ఫోన్ల విక్రయాలు తగ్గే అవకాశం ఉందని రీసెర్చ్‌ సంస్థ ఐడీసీ వెల్లడించింది.  దీంతో ఈ ఏడాది మొత్తం అమ్మకాలు 16 కోట్ల కన్నా తక్కువకే పరిమితం కావచ్చని పేర్కొంది. వరుస గా నాలుగు త్రైమాసికాలు వృద్ధి చెందిన స్మార్ట్‌ఫోన్ల విక్రయాలు.. సెప్టెంబర్‌ త్రైమాసికంలో వార్షి క ప్రాతిపదికన 12 శాతం క్షీణించి 4.8 కోట్ల యూనిట్లకు పరిమితమైనట్లు వివరించింది.

జనవరి–సెప్టెంబర్‌ మధ్య కాలంలో (తొలి తొమ్మిది నెలలు) స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాలు 12 కోట్ల యూనిట్లుగా నమోదైనట్లు ఐడీసీ తెలిపింది. సరఫరా పరమైన సవాళ్లతో నాలుగో త్రైమాసికంలో విక్రయాలు క్షీణించవచ్చని, వచ్చే ఏడాది ప్రథమార్ధం కూడా సమస్యాత్మకంగానే కొనసాగవచ్చని పే ర్కొంది. సెప్టెంబర్‌ త్రైమాసికంలో షావోమి 23.4 శాతం మార్కెట్‌ వాటాతో అగ్రస్థానంలో ఉండగా, శాంసంగ్, వివో  తర్వాత స్థానాల్లో ఉన్నాయి. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top