గూగుల్‌ సీఈవో సంచలన నిర్ణయం! విమర్శలకు దిగొచ్చారా?

after sacking 12k employees Google CEO to take huge pay cut - Sakshi

సాక్షి, ముంబై: వేలాది ఉద్యోగుల తొలగింపు తర్వాత ఐటీ మేజర్‌ సంస్థ గూగుల్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఒకేసారి 12 వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించిన గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌పై విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో తాజాగా తన జీతాన్ని కూడా భారీగా తగ్గించుకున్నారట.

ఉద్యోగులతో టౌన్ హాల్ సమావేశంలో, పిచాయ్ సీనియర్‌ ఉద్యోగుల వేతన కోత  విషయాన్ని ప్రకటించినట్టు సమాచారం. సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నుంచి పైనున్న  పలువురి  టాప్‌ ఉద్యోగుల జీతాల్లో  భారీగానే కోత పడనుంది. సంవత్సరానికి  ఒకసారి ఇచ్చే బోనస్‌ను తగ్గించడంతోపాటు ఇకపై సీనియర్ ఉద్యోగులందరికీ  పని తీరు ఆధారంగానే వార్షిక బోనస్ ఉంటుందని సుందర్ పిచాయ్ ప్రకటించారు. టాప్‌ ఎగ్జిక్యూటివ్‌లతోపాటు సీఈవోగా తన వేతనంలో కోత  విధించుకున్నట్టు తెలుస్తోంది. అయితే వారి వారి జీతాలు ఎంత శాతం తగ్తుతాయి, ఈ కోతలు ఎంతకాలం ఉంటాయనే విషయాలపై స్పష్టతలేదు. (ఆయనకు లేదా బాధ్యత? ముందు గూగుల్‌ సీఈవోను తొలగించండి:పెల్లుబుకిన ఆగ్రహం)

ప్రస్తుతం ప్రపంచమంతా ఆర్థిక మాంద్యం భయం గుప్పిట్లో ఉంది. ఈ నేపథ్యంలో గూగుల్  సహా దాదాపు అన్ని టెక్ కంపెనీలు ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. ప్రధానంగా గూగుల్‌ సంస్థలో ఉద్యోగాల కోతపై సోషల్ మీడియాలో సుందర్‌ పిచాయ్‌పై విమర్శలు గుప్పించారు. వేలాది ఉద్యోగులను తొలగించే బదులు, సీఈవోగా ఆయన జీతంలో కోత విధించు కోవచ్చుగా కదా ప్రశ్నలు వచ్చాయి. అలాగే ఇటీవల యాపిల్ సీఈవో టిమ్ కుక్ 40 శాతం వేతన కోత ప్రకటించిన విషయాన్ని ఉదహరించారు. కాగా IIFL హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2022 ప్రకారం,  పిచాయ్‌ నికర సంపద విలువ 20 శాతం తగ్గి రూ. 5,300 కోట్లుగా ఉంది. 
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top