ఎలోన్ మస్క్, జెఫ్ బెజోస్ దాటేసిన గౌతమ్ అదానీ..!

Adani adds 49 bn Dollars Wealth in 2021, Higher Than Jeff Bezos, Elon Musk - Sakshi

భారత్‌కు చెందిన ప్రముఖ వ్యాపార వేత్త గౌతమ్‌ అదానీ సంపాదన 2021లో భారీగా పెరిగింది. అదానీ గ్రూప్‌నకు చెందిన వివిధ రంగాల షేర్లు అనూహ్యంగా పుంజుకోవడంతో ఈ ఏడాది(2021)లో ప్రపంచంలోనే అతి ఎక్కువ సంపదను ఆర్జించిన వ్యక్తిగా నిలిచారు. నికర సంపద పేరుగదలలో ప్రపంచ కుబేరుల్లో నంబర్‌ 1 స్థానానికి పోటీ పడుతున్న ఎలన్‌ మస్క్‌, జెఫ్ బెజోస్ కంటే అదానీ ముందున్నారు. 2020లో 17 బిలియన్‌ డాలర్లుగా ఉన్న అదానీ నికర ఆస్తి విలువ 2021లో 81 బిలియన్‌ డాలర్లకు చేరిందని ఎమ్3ఎమ్ హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2022 తన నివేదికలో తెలిపింది.

భారత్‌కు చెందిన మరో కుబేరుడు, ఆసియాలోనే అత్యంత సంపాదనపరుడైన ముకేశ్‌ అంబానీ సంపాదన ఇదే సమయంలో 8.1 బిలియన్ల డాలర్లు పెరగడం గమనార్హం. అదానీ గ్రూప్‌కు చెందిన షేర్లు ఒకటి మినహా మిగిలినవన్నీ తక్కువలో తక్కువ 50 శాతం మేర పెరగడంతో అదానీ సంపాదన 2021లో ఈ స్థాయిలో పెరిగింది. ఎమ్3ఎమ్ హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2022 ప్రకారం.. గత సంవత్సరం గౌతమ్ అదానీ సంపద 49 బిలియన్ డాలర్లకు పైగా పెరిగింది. గౌతమ్ నికర సంపద పెరుగుదల "ఎలోన్ మస్క్, జెఫ్ బెజోస్, బెర్నార్డ్ ఆర్నాల్ట్ నికర సంపద పెరుగుదల కంటే ఎక్కువ" అని హురున్ గ్లోబల్ పేర్కొంది. గత 10 ఏళ్లలో అంబానీ సంపద 400 శాతం వృద్ధి చెందగా, అదానీ సంపద 1,830 శాతం పెరిగినట్లు అని జాబితా హురున్ గ్లోబల్ తన నివేదికలో తెలిపింది. 

హెచ్.సీ.ఎల్ టెక్నాలజీ చైర్మెన్ శివ్ నాడార్ 28 బిలియన్ డాలర్ల సంపదతో దేశ ధనికుల జాబితాలో మూడో స్థానంలో ఉండగా, సీరం ఇనిస్టిట్యూట్'కు చెందిన సైరస్ పూనావాలా (26 బిలియన్ డాలర్లు), స్టీల్ మాగ్నెట్ లక్ష్మీ ఎన్ మిట్టల్(25 బిలియన్ డాలర్లు) తర్వాతి స్థానాల్లో నిలిచారు. అదానీకి పోర్టులు, ఎయిర్‌పోర్టులు, కోల్‌మైన్స్‌, పవర్‌ ష్లాంట్లు వంటి వివిధ రంగాల్లో వ్యాపారాలున్నాయి. ఇటీవల 1 గిగావాట్‌ సామర్థ్యం కలిగిన డేటా సెంటర్‌ను దేశంలో ఏర్పాటు చేసేందుకు సైతం అదానీ ఎంటర్‌ ప్రెజెస్‌ ముందుకొచ్చింది. దీంతో సాంకేతిక రంగంలోనూ అదానీ గ్రూప్‌ అడుగు పెట్టినట్టయ్యింది. 

(చదవండి: ఎలక్ట్రిక్‌ వాహన కొనుగోలుదారులుకు షాకిచ్చిన టాటా మోటార్స్‌..!)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top