Actress Alia Bhatt Successful The Businesswoman, Whose Ed-a-Mamma Is Rs 150 Crore Brand Now - Sakshi
Sakshi News home page

Alia Bhatt రూ.150 కోట్ల బ్రాండ్‌, లగ్జరీ కార్లు, నెట్‌వర్త్‌, తొలి సంపాదన తెలుసా?

Published Wed, Mar 15 2023 5:11 PM

Actress Alia Bhatt successful the businesswoman her brand Rs 150 crore - Sakshi

సాక్షి,ముంబై: స్టార్‌  హీరోయిన్‌ అలియా భట్‌ పరిచయం అవసరం లేని పేరు. అందం, అభినయంతో  సినిమా రంగంలో మాత్రమేకాదు అటు భారీ పెట్టుబడిదారుగా ఒక సంస్థకు కో ఫౌండర్‌గా వ్యాపార రంగంలో కూడా రాణిస్తోంది. సక్సెస్‌ఫుల్‌ బిజినెస్‌ విమెన్‌గా భారీ ఆదాయాన్నే ఆర్జిస్తోంది గంగూభాయి. ఈ కంపెనీ స్థాపించిన ఏడాదికే రూ.150 కోట్లకు స్థాయికి చేరుకుంది.

అలియా భట్  మార్చి 15న 30వ పుట్టినరోజు జరుపుకుంటోంది. అద్బుతమైన నటనతో స్టార్‌ హీరోయిన్గా ప్రశంస లందుకుంటున్న ఈ  అమ్మడు విజయవంతమైన వ్యాపారవేత్త కూడా. గర్భవతిగా ఉన్నప్పుడు భట్ ఎడ్-ఎ-మమ్మా (Ed-a-Mamma )లాంచ్‌ చేసింది. ఈ కంపెనీ వెబ్‌సైట్‌లో 800పైగా ప్రొడక్ట్స్‌తో 2-14 సంవత్సరాల వయస్సు పిల్లల బట్టలు విక్రయిస్తుంది. 12 నెలల్లోనే  ఈ కంపెనీ 10 రెట్లు వృద్ధితో రూ.150 కోట్ల వాల్యుయేషన్‌ను సాధించడం విశేషం.

బిజినెస్‌ గురించి ఇంకా నేర్చుకుంటున్నా: అలియా
బిజినెస్‌ గురించి తానింకా నేర్చుకుంటున్నా అని, కేవలం ఏడాది వ్యవధిలో సంస్థ సాధించిన ఘనత  గర్వకారణమని  అలియా భట్‌ ఆనందాన్ని ప్రకటించింది. చిన్న కలగా మొదలై ఇప్పుడు 150 కోట్ల వ్యాపారంగా మారుతోందని, తాను కంపెనీపై కాకుండా వ్యక్తులు ఆలోచనలపైనే పెట్టుబడి పెడతానని ఒక ప్రకటనలో తెలిపింది. కోవిడ్‌ సంక్షోభ సమయంలో ఈ కంపెనీ కోటి రూపాయలను సాధించింది. మరోవైపు గత నెలలో కో-ఫౌండర్‌గా అలియాను ప్రకటించడం  విశేషం. దీంతో పాటు నైకా, ఫూల్.కో, స్టైల్‌ క్రేకర్‌లో కూడా పెట్టుబడిదారుగా ఉంది.  

సొంత ప్రొడక్షన్‌ హౌస్‌
నిర్మాణ సంస్థ ఎటర్నల్ సన్‌షైన్ ప్రొడక్షన్స్‌ను కూడా లాంచ్‌ చేసేంది అలియా.  ప్రస్తుతం అలియా  భట్‌ నికర విలువ రూ.299 కోట్లు. ఫోర్బ్స్ ప్రకారం, ఆమె 2017లో రూ. 39.88 కోట్లు సంపాదించింది; 2018లో ఇది రూ. 58.83 కోట్లకు పెరగింది. 2019లో ఆమె రూ. 59.21 కోట్లు సంపాదించింది.  కాగా సినిమాల్లో ఒక్కో పాత్రకు 20 కోట్లు తీసుకుంటుందని సమాచారం. చిన్నతనంలో తన తండ్రి మహేష్ భట్ పాదాలకు క్రీమ్ రాసేందుకు రూ.500 సంపాదించేదట. అదే తన తొలి సంపాదన అని అలియా చెప్పుకుంటుంది.

అలియా భట్  ఇల్లు, కార్లు
అలియా భట్‌కు  రెండు లగ్జరీ ఇళ్లు ఉన్నట్టు సమాచారం. అలాగే  బీఎండబ్ల్యూ 7 సిరీస్‌, ఆడి ఏ6, ఆడి క్యూ7తో పాటు మూడు  కోట్ల విలువ చేసే రేంజ్ రోవర్ వోగ్ వంటి అనేక కార్లు ఉన్నాయి. ప్రముఖ  బాలీవుడ్‌ దర్శకుడు మహేష్ భట్, నటి సోని రజ్దాన్ కుమార్తె అలియా.  2022 ఏప్రిల్ 14న  హీరో రణబీర్ కపూర్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంది.  2022 నవంబర్ 6న పాప రాహాకు  జన్మనిచ్చింది. ఇక సినిమా  కరియర్‌  విషయానికి వస్తే 2012లో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్‌తో నటిగా గుర్తింపు తెచ్చుకున్న అలియా, హైవే, ఉడతా పంజాబ్‌, రాజీ, గల్లి బాయ్ బాలీవుడ్‌లో పలు విజయవంతమైన మూవీస్‌లో నటించింది. ముఖ్యంగా సంజయ్ లీలా బన్సాలీ గంగూబాయికతియావాడి చిత్రంలోని నటనతో ఆకట్టుకుంది. అలాగే తెలుగులో సెన్సేషనల్‌ మూవీ ఆర్‌ఆర్‌ఆర్‌తో టాలీవుడ్‌ అరంగేట్రం చేసింది. 

Advertisement
 
Advertisement