Apple watch: బ్లడ్ గ్లూకోజ్ ట్రాకింగ్ ఇప్పుడు చాలా సింపుల్.. ఎలా?

Aapple watch blood glucose tracking details - Sakshi

మారుతున్న ప్రపంచంలో మనం వినియోగించే వస్తువులు కూడా అప్డేట్ అవుతూనే ఉన్నాయి, ఇప్పటికే అనేక ఆధునిక ఫీచర్స్‌తో అందుబాటులో ఉన్న యాపిల్ వాచ్ ఇప్పుడు బ్లడ్ గ్లూకోజ్ ట్రాకింగ్ చేయడానికి ఉపయోగపడేలా తయారైంది.

నిజానికి షుగర్‌బాట్ అనేది ఐఫోన్ యాప్. ఇది వినియోగదారులు తీసుకునే ఆహారంలో ఉన్న షుగర్ లెవెల్స్ ట్రాక్ చేస్తుంది. ఎప్పటికప్పుడు షుగర్ లెవెల్స్ ట్రాక్ చేయడం వల్ల ఆరోగ్యం పట్ల మరింత ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవచ్చు. వాచ్‌ఓఎస్ వెర్షన్‌తో వస్తున్న లేటెస్ట్ అప్‌డేట్‌తో ఆపిల్ వాచ్ వినియోగదారులు నేరుగా యాక్సెస్ చేయవచ్చు.

ఇక మీరు యాపిల్ వాచ్‌తో క్యాలరీలు, షుగర్ లెవెల్స్ తెలుసుకోవడంలో షుగర్‌బాట్ ఎంతగానో సహాయపడుతుంది. తెలియని వారు కూడా సులభంగా షుగర్‌బాట్ ఉపయోగించవచ్చు. యాప్ ఓపెన్ చేసిన వెంటనే రోజులో తీసుకున్న ఆహారం గురించి ప్రస్తావించాలి, ఇందులో చికెన్ సూప్ నుంచి బిగ్ మ్యాక్ వరకు అనేక ఆహారాల డేటాబేస్ ఉంటుంది.

(ఇదీ చదవండి: Zomato Everyday: హోమ్ స్టైల్ మీల్స్‌.. కేవలం రూ. 89 మాత్రమే)

మీరు తీసుకున్న ఆహరం యాప్‌లో లేకపోతే చింతించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మాన్యువల్‌గా కూడా మీరు తీసుకున్న ఆహారం గురించి జోడించవచ్చు. ఈ యాప్ క్యాలరీలు, ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, సూక్ష్మపోషకాలు, విటమిన్లు వంటి డేటాకు సంబంధించిన అన్ని వివరాలు వెల్లడిస్తుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top