కోతుల బెడదకు ఎలుగుబంటితో చెక్‌! | - | Sakshi
Sakshi News home page

కోతుల బెడదకు ఎలుగుబంటితో చెక్‌!

Aug 31 2026 12:50 AM | Updated on Aug 31 2026 12:50 AM

పత్తి పంట రక్షణ కోసం రైతు వేషధారణ

జూలూరుపాడు: అసలే ఎల్‌నినోతో వర్షాలు లేవు. అరకొరగా సాగైన పంటలు ఎండలతో వడలిపోతున్నాయి. అంతంత మాత్రంగా ఉన్న నీటితో పంటను కాపాడుకునేందుకు రైతులు ప్రయత్నిస్తుంటే కోతుల బెడద వారిని వేధిస్తోంది. దీంతో పంటను రక్షించుకునేందుకు వినూత్న మార్గాలు అవలంబిస్తున్నారు. జూలూరుపాడు మండలం కాకర్లకు చెందిన రైతు వేముల నాగయ్య పత్తి సాగు చేయగా... కాపు, పూత, పిందె దశలో పంటను వందలాదిగా వస్తున్న కోతుల దండు ధ్వంసం చేస్తోంది. పూతను తుంచి, పిందెలను కొరకడమే కాక కాయలను రాల్చేస్తుండడంతో నాగయ్య ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదు. చివరకు ఆన్‌లైన్‌ ద్వారా ఎలుగుబంటిని పోలిన దుస్తులు, మాస్క్‌ను రూ.1,500తో తెప్పించాడు. ఈ దుస్తులు ధరించి ఆయన తరచూ చేనులో తిరుగుతుండడంతో కోతుల బెడద తగ్గిందని చెబుతున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement