మణుగూరు రూరల్: ఎల్‌నినో ప్రభావంతో వానలు ఆశించినంతగా లేకపోవడంతో రథంగుట్టపై నుంచి హనుమాన్ ఆలయం ఎదురుగా ఉన్న వెన్నెల జలపాతం, రాయిగూడెం వద్ద ఉండే సంపంగి జలపాతాలు వెలవెలబోతున్నాయి. ఏటా జూలై, ఆగస్టు నెలల్లో కురిసే వర్షాలకు రథంగుట్టలపై నుంచి జాలువారే జలపాతాలకు మణుగూరు ప్రజలు తడిసి ముద్దయ్యేవారు. చుట్టూ చెట్లు, ఎత్తైన రథంగుట్ట, పక్షుల కిలకిల రావాలు, అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పగోడాలు, ఇతర సౌకర్యాలతో జలపాతం వద్ద సేదతీరేవారు. సెలవు రోజుల్లో, సాయంత్రాలు రద్దీ బాగానే ఉండేది. ఈ ఏడాది వర్షాలు లేకపోవంతో ప్రజల, ప్రకృతి ప్రేమికుల రాకపోకలులేక కళ తప్పాయి.


