కొత్తగూడెంఅర్బన్: ఫిజికల్ ఎడ్యుకేషన్ రంగంలో పరిశోధన పూర్తి చేసిన గడ్డం రాముకు ఉస్మానియా విశ్వవిద్యాలయం డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ(నీహెచ్‌డీ)ని ప్రదానం చేసింది. పాల్వంచ మండలం కొమ్ముగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్(పీడి)గా పనిచేస్తున్న రాము ప్రొఫెసర్ రాజేష్‌కుమార్ పర్యవేక్షణలో ‘ఎఫెక్ట్ ఆఫ్ సర్క్యూట్ ట్రైనింగ్ అండ్ ప్‌లైయోమెట్రిక్ ట్రైనింగ్ ఫర్ ద డవలప్‌మెంట్ ఆఫ్ మోటార్ ఫిట్‌నెస్ ఎమాంగ్ స్ప్రింటర్స్ ఆఫ్ తెలంగాణ’అనే అంశంపై పరిశోధన చేశారు. ఈ సందర్భంగా రామును డీఈఓ డి.వాసంతి తదతరులు గురువారం అభినందించారు.
శివాలయం ప్రధాన
అర్చకుడికి డాక్టరేట్
సూపర్‌బజార్(కొత్తగూడెం): కొత్తగూడెం ప్రగతి నగర్ శివా లయం ప్రధాన అర్చకుడు, ప్రముఖ శాసీ్త్ర య సంగీత విద్వాంసుడు మద్దిరాల ముక్తేశ్వరరావుకు అమెరికన్ యునైటెడ్ యూనివర్సిటీ పుదుచ్చేరిలో డాక్టరేట్ ప్రదానం చేసింది. ఈయనను సంగీతంలో 48 గంటలు హార్మోనియం ప్రదర్శన ఇచ్చినందుకు ‘హార్మోనియం విధ్వన్వమని‘బిరుదుతో గతంలో సత్కరించారు. కాకినాడలో భజన పోటీల్లో న్యాయనిర్ణేతగా వ్యవహరించినందుకు స్వర్ణసింహ కంకణం‘బహుకరించి సత్కరించారు. ఈ సందర్భంగా ముక్తేశ్వరరావును పలువురు అభినందించారు.
ప్రీ రిలీజ్ పోస్టర్లు ఆవిష్కరణ
భద్రాచలంటౌన్: శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆవరణలో అక్కినేని నాగ అఖిల్ నటించిన ‘లెనిన్’సినిమా ప్రీ రిలీజ్ పోస్టర్లను ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు గురువారం ఆవిష్కరించారు. శ్రేయస్ మీడియా అధినేత శ్రీనివాస్‌రావు సమక్షంలో ఈ పోస్టర్లను ఎమ్మె ల్యే విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలుపు తూ.. సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సినీ అభిమానులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
భద్రగిరి మార్ట్‌లో
ఆర్గానిక్ ఉత్పత్తులు..
భద్రాచలంటౌన్: పట్టణంలో ఐటీడీఏ ఆధ్వర్యాన ఏర్పాటుచేసిన భద్రగిరి మార్ట్‌లోని ఆర్గానిక్, అటవీ ఉత్పత్తులు ఎంతో నాణ్యత కల్గి ఉన్నాయని టీప్రైడ్ (కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ) అదనపు సంచాలకుడు సయ్యద్ ఆరిఫ్‌వలీ తెలిపారు. గురువారం టీప్రైడ్ ప్రతినిధులతో కలిసి మార్ట్‌ను సందర్శించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇక్కడ లభించే ఉత్పత్తులు గిరిజన మహిళలు, రైతులకు ఉపాధి కల్పిస్తున్నాయని, భద్రగిరి మార్ట్ నమూనాను న్యూఢిల్లీ కార్యాలయానికి నివేదిస్తామని తెలిపి ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ కృషిని కొనియాడారు. అనంతరం ఐటీడీఏ ఏపీఓ డేవిడ్‌రాజ్ మార్ట్‌ను ఆకస్మికంగా తనిఖీచేసి రికార్డులను పరిశీలించారు. డిమాండ్‌కు తగినట్లు స్టాక్ ఉంచాలని, చిక్కీ పచ్చళ్ల తయారీలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో టీప్రైడ్ ప్రతినిధులు నేహా శర్మ, సిమ్రాన్ కౌర్, ఐటీడీఏ మేనేజర్ ఆదినారాయణ పాల్గొన్నారు.
వైద్య సేవలు భేష్..
ఒక్కరోజే 57 మందికి స్కానింగ్ పరీక్షలు
భద్రాచలంఅర్బన్: భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో గురువారం రికార్డు స్థాయిలో స్కానింగ్ పరీక్షలు నిర్వహించారు. రేడియాలజిస్ట్ డాక్టర్ నరసింహారెడ్డి ఒక్కరోజులోనే 57 మంది పేషంట్లకు వివిధ రకాల స్కానింగ్‌లు చేసి సేవలందించారు. గత నాలుగేళ్లలో ఏరియా ఆస్పత్రిలో ఒకే రోజులో ఇంత ఎక్కువ సంఖ్యలో నిర్వహించడం ఇదే తొలిసారి. దీంతో వైద్య సేవలు మరింత వేగవంతంగా అందుతున్నాయని పేషంట్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


