సమసమాజమే కమ్యూనిస్టుల లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

సమసమాజమే కమ్యూనిస్టుల లక్ష్యం

Jul 10 2026 5:16 AM | Updated on Jul 10 2026 5:16 AM

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని

భద్రాచలంఅర్బన్‌: దేశంలో అంతరాలు లేని సమసమాజ స్థాపనే కమ్యూనిస్టుల ఏకై క లక్ష్యమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నా రు. గురువారం భద్రాచలంలో నిర్వహించిన సీపీఐ శిక్షణ తరగతుల ముగింపు సమావేశంలో మాట్లాడా రు. దేశంలో ప్రజాస్వామ్య విలువలు దెబ్బతింటున్నాయని, అరాచక పాలన కొనసాగుతోందని విమర్శించారు. దేశప్రజల సంక్షేమం, ఉపాధి, విద్య, వైద్యం వంటి మౌలిక సమస్యలను పరిష్కరించడంలో కేంద్రప్రభుత్వం విఫలమైందని, ప్రజల ప్రయోజనాల కంటే హిందుత్వ ఎజెండా అమలుకే ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని ఆరోపించారు. ప్రజా హక్కుల కోసం నిరంతరం పోరాడుతున్న నిజమైన దేశభక్తులు కమ్యూనిస్టులేనని అన్నారు. సీపీఐ జాతీయ సమితి సభ్యు డు భాగం హేమంతరావు మాట్లాడుతూ పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేసేందుకు సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగాలని సూచించారు. స్థానిక సమస్యల పరిష్కారమే ప్రజ ల్లో పార్టీపై విశ్వాసాన్ని పెంచుతుందని అన్నారు. ఈ సమావేశంలో సీపీఐ భద్రాద్రి, ఖమ్మం జిల్లాల కార్యదర్శులు ఎస్‌.కే.సాబీర్‌ పాషా, దండి సురేష్‌, నాయకులు ముత్యాల విశ్వనాథం, కల్లూరు వెంకటేశ్వర్లు, జమ్ముల జితేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement