రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ
కొత్తగూడెంఅర్బన్: హైదరాబాద్ దోమలగూడలోని వ్యాయామ విద్యా కళాశాలలో జరిగిన దివ్యాంగ విద్యార్థుల రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో జిల్లా విద్యార్థులు ప్రతిభ చాటారు. వివిధ కేటగిరీల్లో 16 మంది విద్యార్థులు పాల్గొని నాలుగు ప్రథమ, నాలుగు ద్వితీయ, మూడు తృతీయ.. మొత్తం 11 బహుమతులు సాధించారు. విజేతలను కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ప్రత్యేకంగా అభినందించారు. పతకాలు, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో జిల్లాకు చెందిన ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులు ప్రతిభ కనబరిచి పతకాలు సాధించడం గర్వకారణమని తెలిపారు. డీఈఓ బి.నాగలక్ష్మి, సెక్టోరియల్ అధికారులు ఎస్‌కే. సైదులు, ఎన్.సతీష్ కుమార్, సమ్మిళిత శిక్షకులు సిద్దయ్య, శ్రీరామ్, రామారావు, పద్మావతి, శుభకర్, నాగలక్ష్మి, జానకి, నాగశ్రీ, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
గ్రంథాలయానికి
రూ.10 లక్షలు..
● నిధులు కేటాయించిన
ఎంపీ రేణుకాచౌదరి
కొత్తగూడెంఅర్బన్: కొత్తగూడెం జిల్లా కేంద్ర గ్రంథాలయ ప్రహరీ నిర్మాణం కోసం రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి రూ.10 లక్షల నిధులు కేటాయించారు. ఈ సందర్భంగా గ్రంథాలయంలో గురువారం జరిగిన కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ పసుపులేటి వీరబాబు మాట్లాడుతూ విద్యాభివృద్ధి పట్ల ఉన్న ఆసక్తి, నిరుద్యోగ యువత, విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రేణుకాచౌదరి నిధులు కేటాయించారని తెలిపారు. గ్రంథాలయ కార్యదర్శి కే.కరుణకుమారి, ఆఫీస్ ఇన్‌చార్జ్ ఎం.నవీన్ కుమార్, గ్రంథపాలకురాలు జీ.మణిమృదుల హర్షం వ్యక్తం చేశారు.
రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ


