అందరి సహకారంతో రోడ్డు ప్రమాదాలకు చెక్..
సుజాతనగర్: రోడ్డు ప్రమాదాల నివారణకు అందరూ సహకరించాలని ఎస్పీ బి.రోహిత్‌రాజ్ కోరారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రజల ప్రా ణాలను కాపాడాలనే దృఢ సంకల్పంతో పోలీస్, రవాణా, ఆరోగ్యశాఖల ఆధ్వర్యంలో అవగాహన కల్పించడం కోసం ప్రభుత్వం ఎరైవ్ – ఎలైవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని ఆయన అన్నారు. కొత్తగూడెం సబ్‌డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో సుజాతనగర్ జెడ్పీహెచ్‌ఎస్‌లో ఆయాశాఖల అధికారుల సమక్షంలో కార్యక్రమాన్ని ఆయన మంగళవారం ప్రారంభించారు. హెల్మెట్ వినియోగం, సీటు బెల్ట్ ప్రాధాన్యత, డిఫెన్సివ్ డ్రైవింగ్ గురించి వివరించా రు. స్వీయ క్రమశిక్షణతో చాలావరకు రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చని తెలిపారు. అనంతరం సుజాతనగర్ పరిధిలో రోడ్డు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబ సభ్యులు వారి ప్రస్తుత పరిస్థితిని వివరించారు. ఈ సందర్భంగా అధికారులు, ప్రజలు, ప్రజా ప్రతినిధులు ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్, ట్రెయినీ ఆర్డీఓ మురళి, జిల్లా రవాణాధికారి భూషిత్ రెడ్డి, ఆర్టీసీ డీఎం రాజ్యలక్ష్మి, చుంచుపల్లి తహసీల్దార్ కృష్ణ, ఎంవీఐలు వెంకటరమణ, వెంకటపుల్లయ్య, సీఐలు ప్రతాప్, శ్రీలక్ష్మీ, వెంకటేశ్వర్లు, ఎస్‌ఐలు రమాదేవి, రమణారెడ్డి, ప్రవీణ్, రవి, ఏఓ నర్మద, పశువైద్యాధికారి కాత్యాయని, వైద్యులు రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
సుజాతనగర్‌లో
‘ఎరైవ్ – ఎలైవ్’ ప్రారంభించిన ఎస్పీ


