ఆరు జిల్లాల స్థాయి కబడ్డీ పోటీలు
కొణిజర్ల: కొణిజర్ల మండలం ఉప్పలచలకలో ఆరు జిల్లాల స్థాయి కబడ్డీ పోటీలు మంగళవా రం ప్రారంభమయ్యాయి. గ్రామసర్పంచ్ గుగులోతు చందు శారద నేతృత్వాన ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, నల్లగొండ, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల స్థాయి పోటీలు నిర్వహిస్తున్నారు. ఈపోటీలను బీఆర్‌ఎస్ నాయకులు చిరుమామిళ్ల రవికిరణ్, లకా వత్ గిరిబాబు ప్రారంభించి మాట్లాడారు. నాయకులు పోట్ల శ్రీను, దేవుళ్ల వీరన్న, బానోత్ రవీందర్, భూక్యా మాన్‌సింగ్, తులిసింగ్, కృష్ణమూర్తి, ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.


