డీప్‌సైడ్ బొగ్గు బ్లాక్ కీలకం..
మణుగూరురూరల్: సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియా మనుగడకు పీకేఓసీ–2 డీప్ సైడ్ బొగ్గు బ్లాకే అత్యంత కీలకమని ఏఐటీయూసీ అదనపు ప్రధాన కార్యదర్శి మిర్యాల రంగయ్య అన్నారు. మంగళవారం ఏరియాలోని కేసీహెచ్‌పీలో జరిగిన ఫిట్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. డీప్ సైడ్ బొగ్గు బ్లాకును కేంద్ర ప్రభుత్వం వేలంలో పెట్టడంతో ప్రైవేట్ సంస్థలు టెండర్లు వేయడానికి ప్రయత్నించాయన్నారు. అయితే గుర్తింపు కార్మిక సంఘాల ఒత్తిడితో ప్రైవేట్ సంస్థలు వెనక్కి తగ్గాయని, ఇది కార్మికుల విజయమని, 1/70 చట్టంప్రకారం ఓసీ–2 డీప్ సైడ్ బొగ్గు బ్లాకును ప్రభుత్వ రంగ సంస్థలకే కేటాయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జెన్‌కో సంస్థను వేలం నుంచి విరమింపజేయాలని కోరా రు. ఎంఎండీఆర్ చట్టానికి మద్దతుగా ఓటు వేయ డం వల్ల కోయగూడెం ఓసీ–3, సత్తుపల్లి ఓసీ ప్రైవేట్ సంస్థలకు దక్కాయని, వీటిని కూడా సింగరేణికే కేటాయించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి వై.రాంగోపాల్, నాయకులు మల్లెల రాంనర్సయ్య, మేకలఈశ్వర్‌రా వు, ఆవుల నాగరాజు, ఆదర్ల సురేందర్, శనిగరపు కుమారస్వామి, బి.రవికుమార్, శ్రీని వాసరావు, శివకుమార్, రాజేందర్, డీవీరావు, సతీశ్, వెంకటేశ్వర్లు, గౌస్‌పాషా, వలి తదితరులు పాల్గొన్నారు.
కళాకారులకు
పుట్టినిల్లు కొమరారం
మాస్‌లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు
ఇల్లెందురూరల్: కళాకారులకు కొమరారం పుట్టినిల్లు వంటిదని, అలాంటి గ్రామంలో జన్మించి, తన పూర్వీకుల ఆనవాయితీని పుణికిపుచ్చుకున్న సాయిలు సినీ దర్శకుడిగా ఎదగడం హర్షణీయమని సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు, ప్రజాకవి జయరాజు అన్నారు. కొమరారంలో రాజు వెడ్స్ రాంబాబు చిత్ర దర్శకుడు కాంపాటి సాయిలు అభినందన సభ మంగళారం రాత్రి నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. కళలపై అభిమానంతో చిరుప్రాయం నుంచే ఆసక్తి చూపిన సాయిలు తనకంటూ ఒక గుర్తింపు కోసం హైదరాబాద్‌లో మకాం వేసి నిరంతర సాధన, కఠోర శ్రమతో నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకున్నారని, ఈ ప్రయాణంలో మరింత ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, చండ్ర అరుణ, నాయిని రాజు, ఆజ్మీర బిచ్చా, కాంపాటి పృథ్వీ తదితరులు పాల్గొన్నారు.
విద్యుదాఘాతంతో మల్టీపర్పస్ వర్కర్‌కు గాయాలు..
దుమ్ముగూడెం: మండలంలోని కొత్తపల్లి పంచాయతీలో విద్యుదాఘాతంతో మల్టీపర్పస్ వర్కర్ కాకా వెంకటేశ్ గాయపడిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. పంచాయతీ సిబ్బంది ముగ్గురు ఎల్‌సీ తీసుకుని గ్రామంలో వీధి లైట్లు ఏర్పాటు చేస్తున్నారు. కాకా వెంకటేశ్ ఓ వైపు పని పూర్తిచేసి, ఎల్‌సీ తీసుకోసి స్తంభం ఎక్కాడు. దీంతో షాక్ తగలడంతో స్తంభం పైనుంచి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని భద్రాచలంలోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు.
బైక్ చోరీపై కేసు
ఇల్లెందురూరల్: మండలంలోని చల్లసముద్రం గ్రామ పంచాయతీ వేములవాడ గ్రామంలో నరాటి వెంకటేశ్వర్లుకు చెందిన బైక్ సోమవారం రాత్రి చోరీకి గురైంది. రోజు మాదిరిగానే రాత్రి ఇంటి ఆవరణలో పెట్టామని ఉదయం చూస్తే బైక్ కనిపించలేదని వెంకటేశ్వర్లు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. మంగళవారం కేసు నమోదు చేసినట్లు సీఐ సురేశ్ తెలిపారు.
చైనా మాంజా
విక్రయిస్తున్న ఇద్దరిపై కేసు
ఖమ్మంక్రైం: నిషేధిత చైనా మాంజా విక్రయిస్తున్న ఇద్దరిపై ఖమ్మం టూటౌన్ పోలీసులు మంగళవారం క్రిమినల్ కేసు నమోదు చేశారు. నగరానికి చెందిన కిషోర్‌రెడ్డి వద్ద లెనిన్‌నగర్ వాసి అషారఫ్ చైనా మాంజాను తీసుకొచ్చి విక్రయిస్తున్నాడు. తనిఖీల్లో ఈ విషయం బయటపడడంతో ఇద్దరిపై కేసు నమోదు చేసి 40బండిళ్ల చైనా మాంజా స్వాధీనం చేసుకున్నారు. వీరిలో అషారప్‌ను అరెస్ట్ చేయగా, పరారీలో ఉన్న కిషోర్‌రెడ్డి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.
డీప్‌సైడ్ బొగ్గు బ్లాక్ కీలకం..
డీప్‌సైడ్ బొగ్గు బ్లాక్ కీలకం..


