పురాతన ఆనవాళ్ల గుర్తింపు
పినపాక: పర్యాటక కేంద్రంగా పాండురంగాపురం అభివృద్ధి చెందుతుందని, అందుకు అనుగుణంగా ముందడుగు వేస్తున్నామని పురావస్తు శాఖ రాష్ట్ర పరిశీలకులు డాక్టర్ నిఖిల్‌దాస్ తెలిపారు. మండలంలోని పాండురంగాపురం గ్రామంలో గల పురాతన సమాధుల (రాకాసి గూళ్లు) వద్ద మంగళవారం తవ్వకాలు ప్రారంభించారు. 200 సంవత్సరాల నాటి సమాధులుగా గుర్తించామని, అప్పటి నిజాం పాలకులు తవ్వినట్లు ఆధారాలు లభించాయని చెప్పారు. అనంతరం 2018లో ప్రభుత్వం తవ్వకా లు జరిపిందని, నిధుల కొరతతో ఒక సమాధిని తవ్వి చూడగా పురాతన పూసలు, పెంకులు, ఎముకలు వంటివి బయటపడ్డాయని వాటి ఆధారంగా మనిషి సుమారు ఎనిమిది అడుగుల ఎత్తు ఉంటా రని నిర్ధారించుకున్నామన్నారు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం పురాతన వాటిని గుర్తించేందుకు నిధు లు మంజూరు చేసిందని అందులో భాగంగా పాండురంగాపురం సమాధుల దగ్గర తవ్వకాలు ప్రారంభించామని తెలిపారు. రానున్న రోజుల్లో తవ్వకాలు పూర్తి చేసి మ్యూజియం ఏర్పాటు చేసేందుకు అడుగులు వేస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో పురావస్తు శాఖ అధికారులు పాల్గొన్నారు.


