రీజియన్‌లో ప్రథమ స్థానంలో పాల్వంచ ఎల్‌పీజీ సెంటర్
అభినందించిన కలెక్టర్ జితేశ్ వి.పాటిల్
సూపర్‌బజార్(కొత్తగూడెం)/పాల్వంచ: ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూషన్ అన్ని విభాగాల రీజినల్ పరిధిలో డొమెస్టిక్ సిలిండర్ల విక్రయాల్లో ప్రథమస్థానంలో నిలిచిన పాల్వంచ ఎల్‌పీజీ సెంటర్ మేనేజర్ అనంతుల లక్ష్మీనారాయణకు అవార్డు అందించారు. హెచ్‌పీసీఎల్ కంపెనీ విజయవాడ రీజినల్ కార్యాలయంలో ఆర్‌ఎం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్ల సమీక్షలో రీజినల్ మేనేజర్ పంకజ్ చౌదరి, డీజీఎం రాహుల్ సింఘ్, ఏరియా సేల్స్ మేనేజర్ పవన్ నరేశ్ ఈ అవార్డును ప్రదానం చేశారు. మిగతా డిస్ట్రిబ్యూటర్లు పాల్వంచ ఎల్‌పీజీ సెంటర్‌ను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. కాగా, అనంతుల లక్ష్మీనారాయణను మంగళవారం కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ తన చాంబర్‌లో అభినందించి, మాట్లాడారు. గ్యాస్‌ను వినియోగదారులకు సకాలంలో సరఫరా చేయాలని, ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్, డీసీఎస్‌ఓ ప్రేమ్‌కుమార్‌తోపాటు త్రినాథ్‌బాబు, రజిత, నరేశ్, మెకానిక్ ప్రకాష్ పాల్గొన్నారు.


