గంజాయి ఆయిల్ స్వాధీనం
సూపర్‌బజార్(కొత్తగూడెం): కొత్తగూ డెం పోస్టాఫీస్ సెంటర్‌లో మంగళవా రం వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా విశ్వసనీయ సమాచారం మేరకు ద్విచక్ర వాహనంపై హైదరాబాద్‌కు తరలిస్తున్న రూ. 15లక్షల విలువైన హాష్ (గంజాయి) ఆయిల్‌ను స్వాధీనం చేసు కుని ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ తెలిపారు. మంగళవారం రాత్రి స్థానిక వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను తెలిపారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం జగదల్‌పూర్‌కు చెందిన తిమ్తి భేల, ఒడిశా రాష్ట్రం మల్కాన్‌గిరి జిల్లా చిత్రకొండ మండలం లిమాతం గ్రామానికి చెందిన మైనర్ నిషేధిత గంజాయి నుంచి తయారు చేసిన ఆయిల్‌ను హైదరాబాద్‌కు తరలిస్తుండగా పోస్టాఫీస్ సెంటర్‌లో టాస్క్‌ఫోర్స్ సీఐ రమాకాంత్, ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్, వన్‌టౌన్ ఇన్‌చార్జ్ సీఐ శివప్రసాద్, ఎస్‌ఐ రాకేశ్ పట్టుకున్నట్లు వివరించారు. వారి నుంచి 3 లీటర్ల గంజాయి ఆయిల్, ద్విచక్ర వాహనం, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. సమావేశంలో సీఐ శివప్రసాద్, ఎస్‌ఐ రాకేశ్ పాల్గొన్నారు.


