భక్తిశ్రద్ధలతో నదీ హారతి
భద్రాచలంటౌన్: భద్రాచలంలోని గోదావరి తీరాన ఆదివారం నదీ హారతి కార్యక్రమం కనుల పండువగా నిర్వహించారు. ది రివర్ ఫెస్టివల్‌లో భాగంగా కరకట్టపై ఏర్పాటు చేసిన ఈ వేడుకను కలెక్టర్ జితేష్ వి పాటిల్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం అర్చకుల వేద మంత్రోచ్ఛరణల మధ్య గోదావరి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతి ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గత నెల 27న ప్రారంభమైన ఈ కార్యక్రమం దేవస్థాన అర్చకులు, గ్రామ పంచాయతీ సిబ్బంది సహకారంతో దిగ్విజయంగా కొనసాగుతోందని పేర్కొన్నారు. కాగా, భక్తుల తీర్థ ప్రసాదాల కోసం కలెక్టర్ తన వంతుగా రూ.వెయ్యి అర్చకులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో దామోదర్ రావు, సీఎస్‌ఆర్ సమ్మిట్ డైరెక్టర్ సుమంత్, అర్చకులు రవికుమార్, వజ్జల రవి భక్తులు పాల్గొన్నారు.
హాజరైన కలెక్టర్ జితేష్ వి.పాటిల్


