కొత్తగూడెంటౌన్: జిల్లాలో గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతూ, గంజాయి రవాణాను అడ్డుకుంటున్న పోలీసులకు శనివారం రాష్ట్ర డీజీపీ డాక్టర్ జితేందర్ ప్రశంసా పత్రాలు, రివార్డులు అందజేసి అభినందించారు. గతంలో సీసీఎస్ సీఐగా పని చేసిన బెల్లం సత్యనారాయణ, టాస్క్‌ఫోర్స్ ఎస్సైలు జలకం ప్రవీణ్, సుమన్, సిబ్బంది రవి, విజయ్, భాస్కర్, సాయిరెడ్డి డీజీపీ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను అందుకున్నారు.
కిన్నెరసానిలో పర్యాటక సందడి
పాల్వంచరూరల్: కిన్నెరసానిలో ఆదివారం పర్యాటకులు సందడి చేశారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చారు. డ్యామ్ పైనుంచి జలాశయాన్ని, డీర్ పార్కులోని దుప్పులను వీక్షించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆనందోత్సాహాల నడుమ గడిపారు. 360 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించగా వైల్డ్‌లైఫ్ శాఖకు రూ.19,660 ఆదాయం లభించగా, 120మంది బోటు షికారు చేయగా టూరిజం కార్పొరేషన్ సంస్థకు రూ.6,270 ఆదాయం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు.
పోలీసులకు ప్రశంసా పత్రాలు