
ఆదివాసీ బిడ్డకు పతకాల పంట
స్పీడ్ స్కేటింగ్ విభాగంలో ప్రతిభ
జూలూరుపాడు: ఆదివాసీ గిరిజన బిడ్డ స్పీడ్ స్కేటింగ్ స్పోర్ట్స్ విభాగంలో ప్రతిభ చాటి పతకాలు సాధించింది. మండలంలోని పడమటనర్సాపురం గ్రామానికి చెందిన జెజ్జర గోపి సుధీర్ కుమార్ – అలివేలు దంపతుల కుమార్తె తేజస్వి.. పుదుచ్చేరి కేంద్రీయ విద్యాలయంలో ఆరో తరగతి చదువుతోంది. ఈనెల 17న చైన్నెలో జరిగిన రీజినల్ స్పోర్ట్స్ మీట్‌లో స్పీడ్ స్కేటింగ్ జూనియర్ విభాగం వన్ ల్యాప్ రోడ్‌లో గోల్డ్ మెడల్, 2వేలు, 1000 మీటర్ల ఫోర్ ల్యాప్ రోడ్ విభాగంలో రెండు రజత పతకాలు సాధించింది. దీంతో జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించింది. తేజస్వి పతకాలు సాధించడంతో కుటుంబసభ్యులతో పాటు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.