
నీటి ఎద్దడి నివారణకు చర్యలు చేపట్టాలి
పాల్వంచరూరల్ : వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి వి.చంద్రమౌళి అధికారులను ఆదేశించారు. మండల పరిధిలోని ఎర్రబోరు, బండ్రుగొండ, కొయ్యగుంపు తదితర గొత్తికోయల ఆవాసాలను గురువారం ఆయన పరిశీలించారు. తాగునీటి సౌకర్యాలు ఎలా ఉన్నాయని ఆరా తీశారు. చేతిపంపులు నిరంతరం పనిచేసేలా చూడాలని, సోలార్ మోట్లార్లను వెంటనే మరమ్మతు చేయాలని మిషన్ భగీరథ ఏఈ, పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. కోయగట్టు అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించి పిల్లలకు సక్రమంగా పోషకాహారం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లోని పిల్లలంతా అంగన్‌వాడీ కేంద్రానికి వచ్చేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. గ్రామానికి రహదారి, విద్యుత్ సౌకర్యం లేదని, కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకపోవడంతో పిల్లలు మధ్యలోనే బడి మానేస్తున్నారని స్థానిక గిరిజనులు డీపీఓ దృష్టికి తెచ్చారు. కార్యక్రమంలో ఎంపీఓ బొగ్గ నారాయణ, ఏఈ మహేశ్వరి, కార్యదర్శులు ప్రవీణ్, నారాయణ, దుర్గారావు పాల్గొన్నారు.
డీపీఓ చంద్రమౌళి