సుముహూర్తాలు వచ్చేశాయ్‌.. | - | Sakshi
Sakshi News home page

సుముహూర్తాలు వచ్చేశాయ్‌..

Apr 16 2025 12:17 AM | Updated on Apr 16 2025 12:17 AM

సుముహ

సుముహూర్తాలు వచ్చేశాయ్‌..

● ఏప్రిల్‌లో బలమైన ముహూర్తాలు ● నేటి నుంచి 30 వరకు పెళ్లిళ్ల సీజన్‌ ● వివాహాలతో కళకళలాడనున్న మండపాలు

భద్రాచలంఅర్బన్‌: ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది ముఖ్యమైన, మహోన్నతమైన ఘట్టం. నూతన వధూవరులు నూరేళ్లు కలిసి జీవించాలంటే ముహూర్త బలం ఉండాలని పెద్దలు చెబుతుంటారు. అందుకే మంచి ముహూర్తం కోసం ఎదురు చూస్తుంటారు. ఇలాంటి వారికి ఈ నెలలో సుముహూర్తాలు ఉన్నాయి. పెళ్లిళ్ల సీజన్‌ వచ్చిందంటే సాధారణంగా ఒక నెలలో ఒకటి, రెండూ, మూడూ లేదా నాలుగైదు ముహూర్తాలు ఉంటాయి. కానీ, ఏప్రిల్‌లో వచ్చినన్ని ముహూర్తాలు గతంలో ఎప్పుడూ రాలేదు. ఏప్రిల్‌లో ఏకంగా 9 పెళ్లి ముహూర్తాలు ఉన్నట్లు పండితులు చెబుతున్నారు. ఒకే నెలలో ఇన్ని మంచి రోజులు ఉండడం చాలా అరుదు. ఏప్రిల్‌ 1 నుంచి 13 వరకు మూఢాలు. ఈ సమయంలో ఎలాంటి శుభకార్యాలు నిర్వహించరు. ఆ తర్వాత 9 ముహూర్తాలు ఉన్నాయి. ఏప్రిల్‌ 14, 16, 18, 19, 20, 21, 25, 29, 30 తేదీల్లో ముహూర్తాలు ఉండటంతో వేలాది వివాహాలు జరగనున్నాయి. ఏప్రిల్‌లో 13వ తేదీ నాటికి మూఢాలు వెళ్లిపోతాయి. సూర్యుడు కుంభం నుంచి మీన రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే ఏప్రిల్‌లో 13 తేదీ వరకు అంటే దాదాపు సగం రోజులు పెళ్లి ముహూర్తాలు లేవు. కానీ, ఆ తర్వాత మరో సగం రోజుల్లో అంటే కేవలం 16 రోజుల్లో 9 ముహూర్తాలు ఉన్నాయి.

ఏప్రిల్‌ ప్రత్యేకం

ఏప్రిల్‌లో మొత్తం తొమ్మిది ముహూర్తాలు ఉన్నాయి. ఇంత ఎక్కువగా పెళ్లి ముహూర్తాలు చాలా అరుదుగా వస్తుంటాయి. సాధారణంగా పెళ్లి ముహూర్తం కుదరాలంటే చాలా అంశాలను పరిశీలించాలి. జాతకాలు, గ్రహస్థితి, తారాబలం, వధూవరుల గణన, రాశిఫలం ఇలా ఎన్నో అంశాలు కలిస్తేనే ఒక మంచి పెళ్లి ముహూర్తం సెట్‌ అవుతుంది. మీ ఇంట్లో పెళ్లి వేడుక చేయాలనుకుంటే ఏప్పిల్‌లో మంచి ముహూర్తం కుదురుతుందంటున్నారు. ఈ ముహూర్తాల్లో ఏదో ఒకటి కచ్చితంగా సెట్‌ అవుతుందని పండితులు చెబుతున్నారు. మార్చి 30 ఉగాది నుంచి విశ్వావసు నామ సంవత్సరం ప్రారంభమవుతుంది. విశ్వావసు నామ సంవత్సరం చైత్రమాసం, బహుళ పక్షం పాఢ్యమి తిథి నుంచి మంచి ముహూర్తాలు ప్రారంభమవుతున్నాయి. వారి జాతక రీత్యా ఏఏ నక్షత్రానికి మంచి ముహూర్తం ఉందో తెలుసుకుని ముహూర్తాలు నిర్ణయించుకోవచ్చని పండితులు పేర్కొంటున్నారు.

మంచి తరుణం

పెళ్లిళ్లు చేసుకునేందుకు విశ్వావసు నామ సంవత్సరం ఏప్రిల్‌లో మంచి ముహూర్తాలు ఉన్నాయి. వారి వారి జాతకాల రీత్యా సరిపడా ముహూర్తాలు పెట్టుకోవచ్చు. పెళ్లి ముహూర్తాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఇది మంచి తరుణం. –విశ్వనాథశర్మ, అర్చకులు, భద్రాచలం

సుముహూర్తాలు వచ్చేశాయ్‌.. 1
1/1

సుముహూర్తాలు వచ్చేశాయ్‌..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement