దార్శనికుడు మాజీ ప్రధాని వాజ్‌పేయి | - | Sakshi
Sakshi News home page

దార్శనికుడు మాజీ ప్రధాని వాజ్‌పేయి

Apr 4 2025 12:19 AM | Updated on Apr 4 2025 12:19 AM

దార్శ

దార్శనికుడు మాజీ ప్రధాని వాజ్‌పేయి

చుంచుపల్లి: దేశ అభివృద్ధిలో నవశకానికి నాంది పలికిన దార్శనిక నేత మాజీ ప్రధాని వాజ్‌పేయి అని మాజీ ఎంపీ అజ్మీరా సీతారాం నాయక్‌, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి అన్నారు. గురువారం కొత్తగూడెం క్లబ్‌లో జరిగిన మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి శతజయంతి ఉత్సవాల్లో వారు మాట్లాడారు. రాజకీయాల్లో ప్రజాస్వామ్యం, విలువల ఆధారిత రాజకీయాలను బలోపేతం చేయడానికి ఆయన కృషి చేశారన్నారు. ఈ సందర్భంగా పలువురు సీనియర్‌ నాయకులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో గోలి మధుసూదన్‌ రెడ్డి, ఉపేందర్‌ సింగ్‌, లక్ష్మి, ఎల్లంకి మురళీమోహన్‌, సుబ్బారావు, పైడిపాటి రవీందర్‌, జీవికే మనోహర్‌, కుంజా ధర్మరావు, డాక్టర్‌ విజయ లక్ష్మి, సీతారామరాజు, బాలరాజు, ఎడ్లపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

రామయ్యకు విరివిగా తలంబ్రాల సమర్పణ

భద్రాచలంటౌన్‌: భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామివారి కల్యాణ మహోత్సవంలో వినియోగించే తలంబ్రాలను రెండు రాష్ట్రాలకు చెందిన భక్తులు విరివిగా సమర్పిస్తున్నారు. పండించిన ధాన్యాన్ని గోటితో వలిచి రామయ్యకు అందించేందుకు రోజూ భక్తులు తరలివస్తున్నారు. ఈ క్రమంలోనే గురువారం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌కు చెందిన శ్రీరామ కోటి భక్త సమాజం ఆధ్వర్యంలో కోటి గోటి తలంబ్రాలను తెచ్చి ఆలయంలో అందించారు. రాజమండ్రికి చెందిన రామ భక్తులు కూడా కోటి గోటి తలంబ్రాలను ఆలయ అధికారులకు అందజేశారు. అనంతరం వేద పండితులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ శ్రవణ్‌ కుమార్‌, ఉప ప్రధాన అర్చకులు అమరవాది మురళీ కృష్ణమాచార్యులకు, శ్రీరామానుజ శ్రీనివాసాచార్యులు, భక్తుడు రామకోటి రామరాజు పాల్గొన్నారు.

సరైన పత్రాలు చూపి వాహనాలు తీసుకెళ్లండి

కొత్తగూడెంఅర్బన్‌: జిల్లాలోని అన్ని పోలీస్‌ స్టేషన్ల పరిధిలో పలు కేసులతో సంబంధం ఉన్న 116 ద్విచక్ర వాహనాలు, 10 ఇతర వాహనాలు హేమచంద్రాపురంలోని పోలీస్‌ హెడ్‌ క్వార్టర్లలో ఉంచినట్లు జిల్లా పోలీస్‌ మోటార్‌ వాహనాల అధికారి ఓ.సుధాకరరావు తెలిపారు. సరైన పత్రాలు చూపి వారి వాహనాలను శుక్రవారం నుంచి 6 నెలలలోపు తీసుకెళ్లవచ్చని పేర్కొన్నారు. పత్రాలను సంబంధిత పోలీస్‌ స్టేషన్లలో సమర్పించి, అక్కడి నుంచి రుజువు పత్రాన్ని తీసుకుని, మోటారు వాహనాల అధికారి కార్యాలయంలో సమర్పించాలని తెలిపారు. అన్‌క్లెయిమ్డ్‌ వాహనాల జాబితా జిల్లా పోలీస్‌ సోషల్‌ మీడియా ఖాతాల్లో ఉంచినట్లు పేర్కొన్నారు.

రామాలయంలో మాక్‌ డ్రిల్‌

భద్రాచలంఅర్బన్‌: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామివారి దేవస్థానంలో గురువారం భద్రాచలం అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో అగ్ని ప్రమాదాల నివారణపై మాక్‌ డ్రిల్‌ నిర్వహించారు. ప్రమాద సమయంలో అందుబాటులో ఉన్న సిబ్బంది స్పందించాల్సిన తీరుపై అవగాహన కల్పించారు. అగ్నిమాపక అధికారి శ్రీనివాస్‌, దేవస్థానం ఎస్పీఎఫ్‌, ప్రైవేట్‌ సెక్యూరిటీ సిబ్బంది పాల్గొన్నారు.

తాలిపేరు ప్రాజెక్ట్‌కు మరమ్మతులు..

ఈఈ సయ్యద్‌ అహ్మద్‌ జానీ

చర్ల: తాలిపేరు మధ్యతరహా ప్రాజెక్ట్‌కు, కాలవలకు మరమ్మతులు చేపట్టాలని ప్రాజెక్టు ఈఈ సయ్యద్‌ అహ్మద్‌ జానీ అధికారులకు సూచించారు. గురువారం ఆయన తాలిపేరుతోపాటు ప్రధాన కాలువను పరిశీలించారు. రెండో జోన్‌లో రైతులు సాగు చేసిన పంటలను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుత రబీలో రెండో జోన్‌కు సాగునీటిని విడుదల చేస్తున్నామని తెలిపారు. సాగు చివరి దశకు చేరిందని, ఈ నెల 10 తర్వాత సాగునీటి విడుదలను నిలిపివేసి మరమ్మతులు చేపట్టాలన్నారు. కాలువపై అండర్‌ టన్నెల్‌ నిర్మాణ పనులను చేపట్టి వర్షాకాలం ఆరంభమయ్యేలోపు పూర్తి చేయాలని డీఈ తిరుపతిని ఆదేశించారు. ఏఈలు ఉపేందర్‌, సంపత్‌, సిబ్బంది ఉన్నారు.

దార్శనికుడు  మాజీ ప్రధాని వాజ్‌పేయి1
1/2

దార్శనికుడు మాజీ ప్రధాని వాజ్‌పేయి

దార్శనికుడు  మాజీ ప్రధాని వాజ్‌పేయి2
2/2

దార్శనికుడు మాజీ ప్రధాని వాజ్‌పేయి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement