భద్రగిరికి పోటెత్తిన భక్తులు
భద్రాచలం: భద్రగిరి భక్తులతో కిటకిటలాడింది. సంక్రాంతి సెలవుల ముగింపునకు తోడు వారాంతపు సెలవు రోజులు రావడంతో భక్తులందరూ భద్రాచలం బాటపట్టారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చి పవిత్ర గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం ప్రత్యేక క్యూలైన్ల ద్వారా అంతరాలయంలోని మూలమూర్తులను దర్శించుకుని పూజలు చేశారు. భక్తులకు ఆటంకం కలగకుండా ఆలయఅధికారులుఏర్పాట్లుచేశారు. కాగా పాపి కొండలకు సైతం పర్యాటకుల తాకిడి పెరిగింది. స్వామివారి దర్శనం అనంతరం భక్తులు, పర్యాట కులు పాపికొండలను సందర్శించారు. భక్తులు, పర్యాటకులు రద్దీతో భద్రాచలంలో హోటళ్లు, లాడ్జీ లు ఇతర వ్యాపార సముదాయాలు కళకళలాడాయి.
రామయ్యకు సువర్ణ తులసీ అర్చన
దేవస్థానంలో స్వామివారి మూలమూర్తులకు శని వారం సువర్ణ తులసీ అర్చన పూజలు చేశారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం మేళతాళాల నడుమ గర్భగుడి నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి బేడా మండపంలో కొలువుదీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం అనంతరం కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. నిత్యకల్యాణంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రసాదాలను స్వీకరించారు.
భద్రగిరికి పోటెత్తిన భక్తులు


