పెద్దమ్మతల్లికి పంచామృతాభిషేకం
పాల్వంచ: మండల పరిధిలోని పెద్దమ్మగుడిలో కనకదుర్గమ్మ అమ్మవారికి శనివారం పంచామృతంతో అభిషేకం నిర్వహించారు. మేళతాళాలతో అర్చకులు, భక్తులు అమ్మవారి జన్మస్థానం నుంచి మూలవిరాట్ వద్దకు చేరుకుని, పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈఓ రజనీ కుమారి తదితరులు పాల్గొన్నారు.
ట్రాఫిక్ సిగ్నల్స్‌పై పరీక్ష
కొత్తగూడెంఅర్బన్: జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఈ నెల 1 నుంచి ప్రారంభమైన భద్రతా మాసోత్సవాలు 31వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ సందర్భంగా జిల్లా కేంద్ర గ్రంథాలయంలో గ్రంథ పాలకురాలు జి.మణిమృదుల ఆధ్వర్యంలో ట్రాఫిక్ సిగ్నల్స్‌పై అవగాహన కోసం పరీక్ష నిర్వహించగా, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు పరీక్ష రాశారు. ఈ కార్యక్రమంలో వన్ టౌన్ పోలీసులు పాల్గొన్నారు.
ట్రాన్స్‌కో పోటీల్లో
జిల్లా జట్టు గెలుపు
సూపర్‌బజార్(కొత్తగూడెం): తెలంగాణ ట్రాన్స్‌కో, డిస్కమ్స్ ఇంటర్ సర్కిల్ వాలీబాల్ టోర్నమెంట్ విజేతగా జిల్లా విద్యుత్ జట్టు నిలిచింది. మూడు రోజులపాటు నల్లగొండలో పోటీలు నిర్వహించారు. వరుసగా నాలుగోసారి జిల్లా వాలీబాల్ జట్టు విజేతగా నిలవడం విశేషం. విజేత జట్టు సభ్యులను శనివారం జిల్లా విద్యుత్ ఎస్‌ఈ జీ మహేందర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో డీఈ టెక్నికల్ ఆఫీసర్ ఎన్.కృష్ణ, వాలీ బాల్ జట్టు కెప్టెన్ ఆర్ శ్రీనివాసరాజు, పి. శివ, ఎస్.భాస్కర్, జి.వెంకటేశ్వరరావు, కె. శ్రీ రామ్‌కుమార్, జి.శివాజీ, ఎన్.సతీష్‌కుమార్ పాల్గొన్నా రు. వీరిలో జి.వెంకటేశ్వరరావు, పి.శివ జాతీయ పోటీలకు ఎంపికయ్యారు.
సయ్యద్ అబ్దుల్ నజీర్‌కు జాతీయ పురస్కారం
సూపర్‌బజార్(కొత్తగూడెం): ప్రపంచ తెలుగు సంస్కృత వేదిక, తెలుగు అసో సియేషన్ ఆఫ్ నేషనల్ అకాడమీ బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలు గు రైటర్స్ అకాడమీ ఆధ్వర్యంలో రామవరానికి చెందిన ప్రముఖ కవి సయ్యద్ అబ్దుల్ నజీర్‌ను జాతీయ ప్రతిభా పురస్కారానికి ఎంపిక చేశారు. నజీర్ సాహిత్య, సాంస్కృతిక తప న, సృజనాత్మక ప్రతిభను గుర్తించి పురస్కారానికి ఎంపిక చేసినట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఈ నెల 21న విజయవాడలో పురస్కా రం అందజేయనున్నట్లు కళావేదిక జాతీయ అధ్యక్షురాలు జి. ఈశ్వరీ భూషణం తెలిపారు. కాగా నజీర్ గతంలో కూడా అనేక పురస్కారాలను అందుకున్నారు.
ట్రైబల్ మ్యూజియానికి రూ. కోటి మంజూరు
భద్రాచలం: భద్రాచలం ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహించే ట్రైబల్ మ్యూజియం అభివృద్ధికి రూ.కోటి నిధులు మంజూరైనట్లు ఐటీడీఏ ఏపీ ఓ (జనరల్) డేవిడ్ రాజ్ తెలిపారు. వికసిత్ భారత్‌లో భాగంగా హైదరాబాద్‌లోని శాంతివనంలో శనివారం నిర్వహించిన సెమినార్‌లో భద్రాచలం ఐటీడీఏ బృందం పాల్గొంది. మా రుమూల ఆదివాసీ గ్రామాల్లో గిరిజన వైద్యులు అందించే ఔషధాలు, ప్రజల ప్రాణాలు కాపాడే విధానాన్ని సెమినార్‌లో పలువురు అడిగి తెలుసుకున్నారని ఏపీఓ తెలిపారు. ట్రైబల్ మ్యూజియం అభివృద్ధి కోసం రూ. కోటితో గతేడాది ప్రతిపాదనలు సమర్పించగా, మినిస్టర్ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ అఫైర్స్ నుంచి నిధులు మంజూరు చేశారని వివరించారు. సెమినార్‌లో గిరిజన మంత్రిత్వ శాఖ అధికారులకు జ్ఞాపిక అందించామని తెలిపారు.
పెద్దమ్మతల్లికి పంచామృతాభిషేకం
పెద్దమ్మతల్లికి పంచామృతాభిషేకం
పెద్దమ్మతల్లికి పంచామృతాభిషేకం


