లక్ష్యానికి దూరంగా..
వానాకాలం సీజన్‌లో ధాన్యం కొనుగోళ్ల వివరాలు
(మెట్రిక్ టన్నుల్లో..)
వానాకాలం ధాన్యం కొనుగోళ్లలో
వెనకబాటు
నిర్దేశిత లక్ష్యం 2.38 లక్షల
మెట్రిక్ టన్నులు
ఇప్పటివరకు కొన్నది
1.32 లక్షల ఎంటీ
మూడు, నాలుగు రోజుల్లో
కొనుగోలు కేంద్రాలన్నీ ఎత్తివేత!
ఎకరాకు 20 క్వింటాళ్ల లోపే..
నాలుగు రోజుల్లో కొనుగోళ్లు పూర్తి
పాల్వంచరూరల్: జిల్లాలో వానాకాలం సీజన్ ధాన్యం కొనుగోళ్లు ముగింపు దశకు చేరాయి. కొనుగోళ్లు లక్ష్యానికి దూరంగానే నిలిచాయి. వానాకాలంలో 1,74,250 ఎకరాల్లో వరి సాగు చేయగా 2.38 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని పౌరసరఫరాలశాఖ అధికారులు లక్ష్యం నిర్దేశించుకున్నా రు. ఇందుకోసం 187కొనుగోలు కేంద్రాలను ఏర్పా టు చేశారు. ఇప్పటి వరకు 134 కేంద్రాల్లో కొనుగోళ్లు ముగిశాయి. 21,567 మంది రైతుల నుంచి 1,32,400 మెట్రిక్ టన్నుల సన్నరకం ధాన్యాన్ని సేకరించారు. మిగిలిన కేంద్రాల్లో రెండు, మూడు రోజుల్లో కొనుగోలుప్రక్రియ పూర్తికానుంది. మొత్తం రూ.316.16 కోట్ల విలువ చేసే ధాన్యం కొనుగోలు చేశారు. 1, 26,800 మెట్రిక్ టన్నుల ధాన్యానికి సంబంధించి రూ.302.36కోట్లు 20,500 మంది రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఇంకా వెయ్యిమంది రైతులకు డబ్బులు జమ కావాల్సి ఉంది.
లక్ష్యం నెరవేరేనా..?
గతేడాది వానాకాలంతో పోల్చిస్తే ఈసారి భారీ గా నే ధాన్యం కొనుగోళ్లు జరిగాయి. అయితే నిర్దేశించిన లక్ష్యం నెరవేరే పరిస్థితి కనిపించడంలేదు. లక్ష్యాన్ని సాధించాలంటే ఇంకా లక్ష మెట్రిక్ టన్ను ల ధాన్యాన్ని సేకరించాల్సి ఉంది. రెండు, మూడు రోజుల్లో కేంద్రాలన్నీ ఎత్తివేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ధాన్యం సేకరణ లక్ష్యానికి దూరంగానే ఉంది. వానా కాలంలో ప్రతికూల వాతావరణ పరి స్థితుల కారణంగా వరిసాగులో ఆశించిన దిగుబడులు రాలేదని రైతులు పేర్కొంటున్నారు. గతేడాది కంటే ఈ ఏడాది సీజన్‌లో ఎకరానికి ఐదు క్వింటాళ్ల దిగుబడి తగ్గిందని చెబుతున్నారు.
విభాగం కేంద్రాలు సేకరించిన మూసివేసిన
ధాన్యం కేంద్రాలు
సహకార సొసైటీ 110 96,650 80
ఐకేపీ 14 9,700 10
జీసీసీ 35 9,500 28
డీసీఎంఎస్ 28 16,408 16
వానాకాలంలో 9 ఎకరాల్లో వరి పంట వేశాను. ఎకరానికి ఖర్చు రూ.30 వేల నుంచి రూ. 35 వేల వరకు వచ్చింది. ధాన్యం దిగుబడి 15 నుంచి 20 క్వింటాళ్లలోపే వచ్చింది. పంట చేతికి వచ్చే సమయంలో వర్షాలు కురవడంతో తెగుళ్లు ఆశించడంతో వరి గింజ తాలుగా మారింది. గతేడాది ఎకరానికి 25 నుంచి 30 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది.
– కళ్లెం వెంకట్‌రెడ్డి, రైతు
వానాకాలం ధాన్యం కొనుగోలు ప్రక్రియ మరో నాలుగు రోజుల్లో పూర్తయ్యే అవకాశం ఉంది. ధాన్యం కొనుగోలు వివరాలు ట్యాబ్‌లో ఎంట్రీ చేయగానే రైతుల ఖాతాల్లో నగదు జమ అవుతుంది. ఎక్కువ శాతం మందికి నగదు చెల్లించాం. పెండింగ్‌లో ఉన్న డబ్బులు కూడా త్వరలోనే జమ అవుతాయి. – ఎస్.త్రినాథ్‌బాబు,
జిల్లా పౌరసరఫరాల కార్పొరేషన్ మేనేజర్
లక్ష్యానికి దూరంగా..
లక్ష్యానికి దూరంగా..


