మతం మారిన వారిని వెనక్కి తీసుకురండి
అశ్వారావుపేటరూరల్: భారతదేశం దేవ భూమి అని అభయ హిందూ ఫౌండేషన్ వ్యవస్థాపకులు రాధామనోహర్‌దాస్ పేర్కొన్నారు. అశ్వారావుపేటలో శనివారం హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యాన నిర్వహించిన ముందస్తు ఉగాది వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. రోగిపై కాకుండా రోగంపై హిందువులు పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే మతం మారిన వారిని శత్రువులుగా చూడకుండా, వారిని వెనక్కి తీసుకురావడంపై దృష్టి సారించాలని సూచించారు. తొలుత రింగ్ రోడ్ సెంటర్‌లో కోలాట ప్రదర్శన, మేళతాళాలతో ఆయనకు స్వాగతం పలకగా.. బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈకార్యక్రమంలో వీహెచ్‌పీ కార్యదర్శి తనికెళ్ల సత్యరవికుమార్‌తో పాటు వివిధ సంఘాల బాధ్యులు పాల్గొన్నారు.
అభయ హిందూ ఫౌండేషన్ వ్యవస్థాపకులు రాధామనోహర్‌దాస్


