కొత్తగూడెంఅర్బన్: దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదకర పరిస్థితిలో ఉందని, రాజ్యాంగ పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కదలిరావాలని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం కొత్తగూడెంలోని కేసీఓఏ క్లబ్‌లో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పొదెం వీరయ్య అధ్యక్షతన జరిగిన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ జిల్లాస్థాయి సదస్సుల మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తున్న రాజ్యాంగాన్ని తొలగించేందుకు బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని విమర్శించారు. ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, రాష్ట్ర ఇరిగేషన్ డెవెలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మువ్వా విజయబాబు, కాంగ్రెస్ నాయకులు ఆళ్ల మురళి, కొప్పుల చంద్రశేఖర్, చీకటి కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.